ఈ సూపర్ ఓవర్స్‌తో అలసిపోయాను: కేన్ మామ

చెన్నై: సూపర్ ఓవర్లలో ఎదురైన ఓటములతో విసిగిపోయానని సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్ ఓవర్‌లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ విఫలమైన వేళ కేన్ విలియమ్సన్(51 బంతుల్లో 8 ఫోర్లతో 51 నాటౌట్) చేసిన ఒంటరి పోరాటం వృథా అయింది. అయితే మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై స్పందించిన కేన్ విలియమ్సన్.. సూపర్ ఓవర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేన్ కెరీర్‌లో ఇది ఆరో సూపర్ ఓవర్ ఓటమి కాగా.. ఇలా సూపర్ ఓవర్స్ ఆడటం వల్ల ఏమైనా విసుగు చెందరా? అని ప్రశ్నించగా.. వాటిలో ఓడిపోవడం వల్ల చికాకు గురయ్యానని బదులిచ్చాడు.

అలసిపోయాను..
'సూపర్ ఓవర్స్‌లో ఎదురైన ఓటములతో అలసిపోయాను. సూపర్ ఓవర్ ఎప్పుడున్నా.. చేజింగ్ టీమ్ ముందు కష్టతరమైన లక్ష్యాన్ని ఉంచాలి. కానీ ఈ మ్యాచ్ ఫలితం మాకు కలిసి రాలేదు. కానీ టోర్నీలో ముందుకుసాగేందుకు కావాల్సిన సానుకూల అంశాలు లభించాయి. క్రికెట్‌లో ఇలాంటి విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి. మ్యాచ్‌లు టైగా ముగుస్తుంటాయి. కానీ ఈ మ్యాచ్‌లు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. చూడటానికి కూడా బాగుంటాయి. చాలా సానుకూలాంశాలు లభించాయి. వీలైనంత త్వరగా ఢిల్లీలో అడుగుపెట్టి టీమ్ పెర్ఫామెన్స్‌పై మరింత ఫోకస్ పెడ్తాం'అని కేన్ విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.

వరల్డ్ కప్ చేజారింది..
2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్.. ఇంగ్లండ్ చేతిలో సూపర్ ఓవర్‌లోనే ఓడి విశ్వకిరిటాన్నీ చేజార్చుకుంది. తొలుత మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారితీయగా.. ఆ తర్వాత అది కూడా టై కావడంతో బౌండరీల లెక్కన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఓ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ కారణంగానే ఓటమి పాలైన కేన్ సేన.. 2019 జనవరిలో భారత్‌తో జరిగిన రెండు టీ20ల్లోనూ సూపర్ ఓవర్స్‌లోనే ఓటమిపాలైంది.

ఐపీఎల్‌లో రెండోసారి..
ఇక ఐపీఎల్‌లో కేన్ విలియమ్సన్ ఆడిన రెండు సూపర్ ఓవర్స్‌లో ఓటమే ఎదురైంది. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీయగా.. ఆరెంజ్ ఆర్మీ చిత్తుగా ఓడింది. ఆ మ్యాచ్‌లో కేన్ మామ 19 బంతుల్లో 29 రన్స్ చేసి మ్యాచ్ టై కావడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా హాఫ్ సెంచరీతో వీరోచిత పోరాటం చేసి మ్యాచ్ టైగా ముగించి మరో సూపర్ ఓవర్ ఆడేలా చేశాడు. కానీ విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications