కుక్ బ్రో సెంచరీ చేశా.. ఇక నుంచి ఆ మాట అనొద్దు: జోస్ బట్లర్

ఢిల్లీ: 'నేను సెంచరీ చేశా.. నువ్వు చేయలేదు'అని అలిస్టర్ కుక్ ఇక నుంచి తనను ఆటపట్టించడని రాజస్థాన్ రాయల్స్, ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ తెలిపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 55 పరుగులతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ (64 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 124) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. టీ20 కెరీర్‌లో అతనికిదే ఫస్ట్ సెంచరీ. తన విధ్వంసకర ఇన్నింగ్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బట్లర్‌కు మ్యాన్ ఆఫ్ ది అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం ఈ సెంచరీ పట్ల సంతోషం వ్యక్తం చేసిన బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కుక్.. సెంచరీ చేశా...
'నా కెరీర్ ప్రారంభంలో ఇంగ్లండ్ తరపున ఎక్కువగా మిడిల్ ఆర్డర్‌లో ఆడేవాడిని. ఆ స్థానంలో వస్తే సెంచరీలు చేసే అవకాశం పెద్దగా ఉండదు. ఇక టీ20ల్లో అయితే మరీ కష్టం. 2017-18 నుంచి మాత్రం ఇంగ్లండ్ తరపున టీ20ల్లో రెగ్యులర్ ఓపెనర్‌గా ఆడుతున్నా. అయినా సెంచరీ సాధించలేకపోయా. కానీ ఐపీఎల్‌లో ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో ఆ కోరిక నెరవేరింది. అంతేగాక ఈ సందర్భంగా నా మిత్రుడు.. సీనియర్ క్రికెటర్ అలిస్టర్ కుక్‌కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఈరోజు సెంచరీ సాధించా.. టీ20ల్లో సెంచరీ సాధించలేకపోయావనే కుక్ నోటి నుంచి ఇక నేను ఆ మాట విననేమో అంటూ 'నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

లక్కీగా ఔట్ చేయలేదు..
ఇక తన ఆటపై స్పందిస్తూ.. 'నా ఆటను పూర్తిగా ఆస్వాదించాను. వికెట్‌పై అంతసేపు ఉండటం చాలా సరదాగా అనిపించింది. ఆరంభంలో కొంత తడబడ్డాను. ప్రస్తుతం నేను గొప్ప ఫామ్‌లో ఉన్నాననే అనుభూతి కలుగుతోంది. మైదానం చిన్నది కావడంతో బంతులు ఎక్కువగా ఆడితే రాణించవచ్చని గ్రహించా. నా ఆట పట్ల చాలా గర్వంగా ఫీలవుతున్నా. రషీద్ బౌలింగ్‌లో తడబడ్డ మాట వాస్తవం. గత కొన్నేళ్లుగా అతను నాపై పై చేయిసాధిస్తున్నాడు. అదృష్టవశాత్తు ఈ రోజు ఔట్ చేయలేదు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ప్రణాళికలకు తగ్గట్లు కట్టడి చేసి విజయాన్నందుకున్నాం. 'అని తెలిపాడు.

బట్లర్ విధ్వంసం..
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. జోస్ బట్లర్(64 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 124) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. సంజూ శాంసన్(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) భాద్యతాయుత ఇన్నింగ్స్‌తో రాణించాడు. సన్‌రైజర్స్ చెత్త ఫీల్డింగ్‌ను అవకాశంగా మార్చుకున్న ఈ ఇద్దరు రెండో వికెట్‌కు ఏకంగా 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, రషీద్ ఖాన్, విజయ్ శంకర్ తలో వికెట్ తీశారు. అనంతరం హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. జానీ బెయిర్ స్టో(31), మనీష్ పాండే(30)తో సహా అంతా విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, క్రిస్ మోరీస్ మూడేసి వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ, రాహుల్ తెవాటియా చెరొక వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications