IPL 2021: మూడు ఫార్మాట్‌లలో బుమ్రానే బెస్ట్.. భువనేశ్వర్ బౌలింగ్‌లో లోపం అదే: బిషప్

ముంబై: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఇయాన్ బిషప్ ప్రశంసల వర్షం కురిపించాడు. మూడు ఫార్మాట్‌లలో బుమ్రానే బెస్ట్ బౌలర్ అని, అతడు అంత ఫిట్‌గా ఉండడాన్ని తాను నమ్మలేకపోతున్నానన్నాడు. ఐపీఎల్ 2021లో భాగంగా శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 13 పరుగుల తేడాతో గెలిచింది. స్లాగ్ ఓవర్లలో బుమ్రా హైదరాబాద్‌ను అద్భుతంగా కట్టడి చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఓ వికెట్ తీసి 14 పరుగులే ఇచ్చాడు. ఇదే మ్యాచులో ఆడిన మరో భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తేలిపోయాడు. 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు.

ఎంతో కష్టపడ్డాడు:
తాజాగా ఇయాన్ బిషప్ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాల బౌలింగ్‌లోని తేడాను వివరించాడు. అదే సమయంలో బుమ్రా సక్సెస్ ఏంటో చెప్పాడు. 'బుమ్రా అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన తర్వాత ఓ దశలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఆ తర్వాత తన బౌలింగ్‌ను మెరుగుదిద్దుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు. మంచి రిథమ్‌ను అందుకున్నాడు. పేస్ బౌలింగ్‌లో కచ్చితత్వాన్ని సాధించడంపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. అప్పుడే బుమ్రా మంచి సక్సెస్ చూశాడు. ఆ తర్వాత వెనక్కిచూడాల్సిన అవసరం లేకుండా పోయింది' అని బిషప్ చెప్పాడు.

భువీ బౌలింగ్‌లో కంట్రోల్ ఉండదు:
'స్లో బాల్స్ ఎలా వేయాలి. ఆఫ్ కటర్స్ ఎలా వేయాలి, యార్కర్లు ఎక్కడ సంధించాలి, లెంగ్త్ బాల్స్‌ను ఎప్పుడు వేయాలి అనే విషయాలను బుమ్రా బాగా అర్థం చేసుకున్నాడు.పేస్ బౌలింగ్‌ను అతను అర్థం చేసుకున్న అమోఘం. బుమ్రా స్థాయి బౌలరే భువనేశ్వర్ కూడా. ఇద్దరికీ చాలా పోలికలున్నాయి. భువీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి కృష్టి చేస్తాడు. బౌలింగ్ వేసేటప్పుడు తన ఆలోచనతో భిన్నమైన బంతుల్ని వేస్తాడు. అతను బుమ్రా కంటే మంచి పేసర్ కాకపోవచ్చు. బుమ్రా బౌలింగ్‌లో కంట్రోల్ ఉంటుంది. భువీ బౌలింగ్‌లో అది కాస్త లోపిస్తుంది. అందుకే ఇద్దరిలో బుమ్రానే మంచి బౌలర్' అని ఇయాన్ బిషప్ అన్నాడు.

సెన్సేషనల్ బౌలర్ బుమ్రా:
'బుమ్రా టీమిండియాకు అన్ని ఫార్మాట్లు ఆడుతూ దానికి తగ్గట్టు బౌలింగ్ చేయడం అద్భుతం. బుమ్రా లేని టీమిండియా, ముంబై ఇండియన్స్ జట్లను అస్సలు ఊహించలేను. అన్ని ఫార్మాట్లకు సరిపోయే ఒక సెన్సేషనల్ బౌలర్ బుమ్రా. నిరంతరం మ్యాచులు ఆడుతూ అంత ఫిట్‌గా ఉండడాన్ని నేను నమ్మలేకపోతున్నా' అని వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఇయాన్ బిషప్ చెప్పుకొచ్చాడు. 2016లో బుమ్రా టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. అతని కాలంలోనే స్టార్ బౌలర్‌గా ఎదిగాడు. భారత్ తరఫున 19 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. ఇక 95 టీ20 మ్యాచులు కూడా ఆడాడు.
CSK vs RR: మెరిసిన డుప్లెసిస్, అలీ.. రాజస్థాన్‌కు భారీ లక్ష్యం!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications