For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs RR: మెరిసిన డుప్లెసిస్, అలీ.. రాజస్థాన్‌కు భారీ లక్ష్యం!!

IPL 2021, CSK vs RR: Faf du Plessis, Ambati Rayudu helps Chennai Super Kings scores 188

ముంబై: రాజస్థాన్‌ రాయల్స్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్‌ అందరూ సమిష్టిగా రాణించడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ పోరాడే స్కోరు చేసింది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 రన్స్ చేసి.. రాజస్థాన్ ముందు 189 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఫాఫ్ డుప్లెసిస్ ‌(33: 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మొయిన్‌ అలీ (26: 20 బంతుల్లో 1 ఫోర్‌, 2 ఫోర్లు), అంబటి రాయుడు (27: 17 బంతుల్లో 3 సిక్సర్లు) సమిష్టిగా రాణించారు. సురేశ్ రైనా (18), ఎంఎస్ ధోనీ (18) ధాటిగా ఆడలేకపోయారు. ఇన్నింగ్స్ చివరలో చెన్నై వరుసగా వికెట్లు కోల్పోవడంతో 200 పరుగుల మార్క్ అందుకోలేకపోయింది. రాజస్థాన్‌ బౌలర్లలో చేతన్‌ సకారియా (3/36), క్రిస్ మోరీస్ ‌(2/33) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి శుభారంభం లభించలేదు. చెన్నై ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్‌ గైక్వాడ్ నెమ్మదిగా ఆడారు. ముస్తాఫిజుర్‌ రెహ్మాన్ వేసిన నాలుగో ఓవర్‌లో యువ ఓపెనర్‌ గైక్వాడ్‌ ఔటయ్యాడు. దూబేకే చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. దీంతో 25 పరుగులకు చెన్నై మొదటి వికెట్ కోల్పోయింది. గత రెండు మ్యాచ్‌ల్లో 5 (8), 5 (16) పరుగులే చేసిన గైక్వాడ్..‌ ఈ మ్యాచ్‌లోనూ 10 (13) తక్కువ రన్స్‌కే పెవిలియన్‌ చేరాడు. గత సీజన్‌లో అద్భుతంగా రాణించిన గైక్వాడ్ ఈ ఏడాది ఆరంభం నుంచి తడబడుతున్నాడు.

జయదేవ్ ఉనద్కత్‌ వేసిన ఐదో ఓవర్లో డుప్లెసిస్‌ చెలరేగాడు. వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 4, 4, 6, 4 బాది మొత్తంగా 19 పరుగులు రాబట్టాడు. క్రిస్‌ మోరీస్‌ వేసిన తర్వాతి ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్‌ ఆడేందుకు యత్నించిన డుప్లెసిస్‌.. బౌండరీ లైన్‌ వద్ద రియాన్‌ పరాగ్‌ చేతికి చిక్కాడు. ఈ సమయంలో మొయిన్‌ అలీ కాసేపు దూకుడుగా ఆడి రన్‌రేట్‌ పడిపోకుండా చూశాడు. హిట్టింగ్‌ చేస్తున్న అలీని రాహుల్ తెవాటియా ఓ అద్భుత బంతితో ఔట్‌ చేశాడు. దీంతో బ్యాటింగ్ భారం అంబటి రాయుడు, సురేష్ రైనాలపై పడింది.

రియాన్‌ పరాగ్‌ వేసిన 11వ ఓవర్లో రాయుడు, రైనా చెరో సిక్స్‌ కొట్టడంతో 16 పరుగులు వచ్చాయి. తెవాటియా వేసిన ఆ తర్వాతి ఓవర్లో రాయుడు వరుసగా రెండు సిక్సర్లు బాది 14 రన్స్‌ పిండుకున్నాడు. దీంతో 12 ఓవర్లకే చెన్నై స్కోరు 100 దాటింది. అయితే చేతన్‌ సకారియా వేసిన 14వ ఓవర్‌ రెండో బంతికి భారీ షాట్‌ ఆడబోయిన రాయుడు (27) పెవిలియన్ చేరాడు. అదే ఓవర్‌లో రైనా (18) కూడా క్రిస్‌ మోరీస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులో ఉన్న కెప్టెన్ ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా పెద్దగా రన్స్‌ రాబట్టలేకపోయారు. ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు.

సకారియా వేసిన 18వ ఓవర్ తొలి బంతికి ఫోర్‌ కొట్టిన ధోనీ.. తర్వాతి స్లో బాల్‌ను షాట్‌ ఆడబోయి బట్లర్‌ చేతికి చిక్కాడు. మోరీస్‌ వేసిన తర్వాతి ఓవర్లో జడేజా వెనుదిరిగాడు. మోరీస్‌ బౌన్సర్ సాధించగా.. షాట్ ఆడబోయిన జడేజా కీపర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆఖర్లో డ్వేన్‌ బ్రావో (20 నాటౌట్‌) తమదైన శైలిలో రెచ్చిపోయాడు. రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాది చివరి బంతికి ఠాకూర్‌ను రనౌట్ చేశాడు. దీంతో చేనేనై జట్టు స్కోరు 188 వద్ద ఆగిపోయింది.

Story first published: Monday, April 19, 2021, 21:50 [IST]
Other articles published on Apr 19, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+