For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs DC Trolls: గురు.. గురు అంటూ గుండెల మీద తన్నావ్ కదరా.. నెట్టింట పేలుతున్న సెటైర్స్, మీమ్స్!

IPL 2021: Hilarious memes from CSK vs DC game

హైదరాబాద్: గురు-శిష్యుల సమరంగా సాగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి.. రిషభ్ పంత్ చెక్ పెట్టాడు. బలమైన బ్యాటింగ్ లైనప్‌తో భారీ టార్గెట్‌ను ఊదేసి.. లీగ్‌లో అదిరిపోయే బోణీ కొట్టాడు. ఫలితంగా శనివారం జరిగిన సెకండ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచింది. అయితే ఎన్నో అంచనాల మధ్య జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఓడటంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియా వేదికగా ఫన్నీ మీమ్స్, ట్రోల్స్ ట్రెండ్ చేస్తున్నారు. గురు గురు అంటూనే గుండెల మీద తన్నావ్ అంటూ పంత్, ధోనీని ఉద్దేశించి ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ఎంత పనిచేశావ్ ధోనీ భయ్యా..

ఇక భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన మహేంద్ర సింగ్ ధోనీ డకౌటవ్వడంపై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో విఫలమై ధోనీ(0) బౌల్డయ్యాడు. అతని బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా వెళ్లి వికెట్లని గీరాటేసింది. దాంతో.. ధోనీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. అలాగే ధోనీ మార్క్ కెప్టెన్సీ కనిపించలేదంటూ కామెంట్ చేస్తున్నారు. నీ శిష్యుడు నిన్ను మించిపోయడు భయ్యా అనే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ఓయ్ సామ్ కరన్..

ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన టామ్ కరన్ బౌలింగ్‌లో అతని తమ్ముడు సామ్ కరన్ చెలరేగిపోయాడు. చెన్నై టీమ్ 18 ఓవర్లు ముగిసే సమయానికి 155/6తో నిలిచిన దశలో టామ్ కరన్ బౌలింగ్‌కిరాగా.. సామ్ కరన్ వరుసగా 6, 6, 4 బాదేశాడు. అదే ఓవర్‌లో ఒక వైడ్ కూడా పడగా.. జడేజా ఒక ఫోర్ కొట్టేశాడు. దాంతో.. ఆ ఓవర్‌లో మొత్తం 23 పరుగుల్ని టామ్ కరన్ సమర్పించుకున్నాడు. దాంతో ఈ ఇద్దరిపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. వారి ఫ్యామిలీ రియాక్షన్స్‌పై చేసిన మీమ్స్ నవ్వును తెప్పిస్తున్నాయి. ఢిల్లీకి టామ్ కరన్ ఆడిన ఫస్ట్ మ్యాచ్‌నే అతని తమ్ముడు చివరి మ్యాచ్‌గా మార్చేశాడని కామెంట్ చేస్తున్నారు.

చిన్న తాలా బ్యాక్..

ఢిల్లీ యువ ఓపెనర్ పృథ్వీ షా గత ఏడాది కాలంగా పేలవ ఫామ్‌తో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దాంతో.. చెన్నైపై మెరుపు హాఫ్ సెంచరీతో అతను విమర్శకుల చెంపలు వాయించేశాడని నెటిజన్లు ఫన్నీగా చెప్పుకొస్తున్నారు. చెన్నై బౌలర్లని అతను ఉతికారేసిన తీరుపై కూడా సెటైర్లు పేలుతున్నాయి. ఇక సురేశ్ రైనా రీఎంట్రీతో చెన్నై టీమ్ బలం పెరిగిదంటూ సరదాగా మీమ్స్‌ని అభిమానులు తయారు చేస్తున్నారు. చిన్న తాలా ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఆడుతూ పాడుతూ...

ఆడుతూ పాడుతూ...

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. సురేశ్‌ రైనా (36 బంతుల్లో 54; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... మొయిన్‌ అలీ (24 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్యామ్‌ కరన్‌ (15 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. వోక్స్, అవేశ్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం ఢిల్లీ 18.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (54 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), పృథ్వీ షా (38 బంతుల్లో 72; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు.

Story first published: Sunday, April 11, 2021, 10:57 [IST]
Other articles published on Apr 11, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+