న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs KKR:మ్యాచ్‌లోనే కాదు.. వ్యూయర్ షిప్‌లోనూ రికార్డులన్నీ బద్దలు!

IPL 2021: Highest viewers for CSK vs KKR match on Disney+ Hotstar is recorded at 7.0M

ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ వ్యూయర్‌షిప్ పరంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రెండు మేటీ జట్ల మధ్య బౌండరీల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు జనాలు ఆసక్తి కనబర్చారు. దాంతో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌లకన్నా ఈ మ్యాచ్ అత్యధిక వ్యూయర్‌షిప్‌ను సాధించింది. డిస్నీ హాట్‌స్టార్‌లో 7 మిలియన్ల మంది ఈ మ్యాచ్ లైవ్‌ను వీక్షించారు. ఈ సీజన్‌లోఇప్పటి వరకు ఇదే రికార్డు. అయితే గత సీజన్‌లో మాత్రం ముంబై-చెన్నై మధ్య జరిగిన ఓ మ్యాచ్‌ను హాట్‌స్టార్‌లో 8 మిలియన్ల మంది చూసారని, అదే ఆల్‌టైమ్ రికార్డని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బుధవారం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు సీఎస్‌కే 18 పరుగుల తేడాతో కేకేఆర్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్‌ డు ప్లెసిస్‌ (60 బంతుల్లో 95 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీకి ఐదు పరుగుల దూరంలో నిలువగా... రుతురాజ్‌ గైక్వాడ్‌ (42 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదన మొదలు పెట్టిన కోల్‌కతాను ఆరంభంలో దీపక్‌ చహర్‌ (4/29) తన పేస్‌తో దెబ్బకొట్టినా... అనంతరం పుంజుకుని 19.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇన్‌గిడి (3/28) కూడా ఆకట్టుకున్నాడు.

ఓ దశలో కేకేఆర్ 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టుకు ఘోరపరాభావం తప్పదని అంతా భావించారు. కానీ ప్యాట్‌ కమిన్స్‌ (34 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), ఆండ్రీ రసెల్‌ (22 బంతుల్లో 54; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), దినేశ్‌ కార్తీక్‌ (24 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో కేకేఆర్‌ను విజయానికి చేరువ చేశారు. కానీ చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆ టీమ్ విజయాన్నందుకోలేకపోయింది.

Story first published: Thursday, April 22, 2021, 7:52 [IST]
Other articles published on Apr 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X