
వారే ట్రాన్స్‌ఫర్‌కు అర్హులు
2018లో బీసీసీఐ తొలిసారిగా మిడ్-సీజన్ ట్రాన్స్‌ఫర్ విండోను ప్రవేశపెట్టింది. ఇక ఐపీఎల్ 2020లో తొలిసారిగా ఐపీఎల్ గవర్నింగ్ బాడీ.. క్యాప్డ్ ప్లేయర్లను సైతం ఫ్రాంచైజీలు బదిలీ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. సగం సీజన్ ముగిసినా.. రెండు కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాని ఆటగాళ్లలే మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్‌కు అర్హులు అవుతారు. ఒక్కో జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఈ బదిలీ నిబంధనలు అమల్లోకి వస్తుంది. ఐపీఎల్ 2021 కోసం ఏప్రిల్ 26 రాత్రి 9 గంటలకు ఈ బదిలీలకు బీసీసీఐ విండోను ఓపెన్ చేసింది. మే 23 వరకు ఫ్రాంచైజీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

సొంత జట్టుపై ఆడకూడదు
ఓ ఆటగాడిని బదిలీ చేసినా.. సీజన్ ముగిసే వరకు అతడు సొంత ఫ్రాంచైజీ సభ్యుడిగానే ఉంటాడు. ఇతర ఫ్రాంచైజీకి వెళ్లిన తర్వాత ఆ ప్లేయర్ తన సొంత ఫ్రాంచైజీతో జరిగే మ్యాచ్‌కు దూరంగా ఉండాలి. సొంత జట్టుపై మ్యాచ్ ఆడటానికి అతడికి అర్హత ఉండదు. సదరు ఆటగాడికి ఆ సీజన్‌కు సంబంధించిన పూర్తి జీతం తన సొంత ఫ్రాంచైజీనే చెల్లించాలి. అయితే తనను అప్పుగా తీసుకున్న ఫ్రాంచైజీ మాత్రం మ్యాచ్‌కు కొంత ఫీజు చెల్లిస్తుంది. ఒక ఫ్రాంచైజీ ముగ్గరి కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను బదిలీ చేసుకునే వీలు ఉండదు. ఈ నిబంధనలు అన్నీ పాటిస్తూ ఆటగాళ్లను మిడ్-సీజన్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
PBKS vs RCB: చహల్.. ఔర్ ఏక్ దాల్! దెబ్బకు షారుఖ్ ఔట్! (వీడియో)

రాయ్‌ని తీసుకోవాలి రాయల్స్ ఆరాటం
రాజస్థాన్ రాయల్స్ ప్రాంచైజీ ఈ సీజన్ ప్రారంభానికి ముందే రాబిన్ ఊతప్పను చెన్నై సూపర్ కింగ్స్‌కు అమ్మేసింది. ఇప్పుడు రాయల్స్ పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో ఊతప్పను తిరిగి తీసుకోవాలి చూస్తోంది. ఇక జోఫ్రా ఆర్చర్, లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ స్టోక్స్ జట్టుకు దూరం అవడంతో జేసన్ రాయ్‌ని అప్పుగా తెచ్చుకోవాలని భావిస్తోంది. జేసన్ రాయ్ ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్నాడు. సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. హైదరాబాద్ విదేశీ ప్లేయర్ల స్లాట్స్ కూడా నిండుగా ఉన్నాయి. దీంతో అతడిని తీసుకోవాలని భావిస్తున్నది. ఇషాన్ పోరెల్‌పై కూడా రాయల్స్ కన్నేసింది.

ఫెర్గూసన్‌పై కన్నేసిన బెంగళూరు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రాంచైజీకి చెందిన అడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ కరోనా భయంతో ఇప్పటికే జట్టను వీడారు. వీరి స్థానంలో కేకేఆర్ జట్టులో ఉన్న లాకీ ఫెర్గూసన్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మిడిల్ ఆర్డర్, మ్యాచ్ ఫినిషర్ లేక ఇబ్బంది పడుతున్నది. కోల్‌కతా నైట్‌రైజడర్స్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది. పంజాబ్ కూడా సరైన మిడిల్ ఆర్డర్ ఆటగాడి కోసం చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జట్లు మిడ్-సీజన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఇతర ఫ్రాంచైజీల్లో ఉన్న ఆటగాళ్లను అప్పుగా తెచ్చుకోవాలని భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications
