PBKS vs RCB: చహల్.. ఔర్ ఏక్ దాల్! దెబ్బకు షారుఖ్ ఔట్! (వీడియో)

అహ్మదాబాద్: ఐపీఎల్ 2021లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఇంతవరకు తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయాడు. ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడి కేవలం నాలుగే వికెట్లు పడగొట్టాడు. పరుగులు ఇవ్వకపోయినా.. వికెట్లు మాత్రం తీయలేకపోతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లోనూ మోస్తరు ప్రదర్శన చేశాడు. తొలి స్పెల్‌లో రెండు ఓవర్లు వేసి ఏకంగా 28 పరుగులు ఇచ్చాడు. రెండో స్పెల్‌లో మాత్రం ఆకట్టుకున్నాడు. రెండు ఓవర్లలో ఆరు పరుగులే ఇచ్చిన చహల్.. ఒక వికెట్ పడగొట్టాడు.
15వ ఓవర్‌లో యజువేంద్ర చహల్ అద్భుతమైన గూగ్లీతో పంజాబ్ కింగ్స్ హిట్టర్ షారుఖ్ ఖాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. అది కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ సలహాతోనే. అంతకు ముందు షారుఖ్‌కు ఇదే రకమైన బంతిని (గూగ్లీ) సంధించిన చహల్.. ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేయగా అంపైర్ స్పందించలేదు. దీంతో అతడికి నిరాశే ఎదురైంది. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ వెంటనే స్పందించి.. ఫీల్డ్ సెట్ చేసి, ఔర్ ఏక్ దాల్ (ఇంకోటి అలాగే వేసెయ్) అంటూ ఉత్సాహపరిచాడు. చహల్ వేసిన రెండో బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన షారుఖ్ వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్.. యజువేంద్ర చహల్‌కు ఆర్‌సీబీ తరఫున 100వ ఐపీఎల్ మ్యాచ్. 2013లో ముంబై ఇండియన్స్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన యూజీ.. ఆ మరుసటి ఏడాదే ఆర్‌సీబీలో చేరాడు. తనదైన బౌలింగ్‌తో సత్తా చాటి అక్కడి నుంచి టీమిండియాకు ఎంపికయ్యాడు. 2013లో ముంబై తరఫున ఏకైక మ్యాచ్ ఆడిన చహల్.. ఆర్‌సీబీ తరఫున ఇప్పటి వరకు 105 మ్యాచ్‌లాడి 7.70 ఎకానమీతో 125 వికెట్లు తీశాడు.
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పంజాబ్ 34 పరుగుల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (91 నాటౌట్; 57 బంతుల్లో 7×4, 5×6), యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (46; 24 బంతుల్లో 6×4, 2×6), యువ ఆటగాడు హర్‌ప్రీత్ బ్రార్ (25 నాటౌట్; 17 బంతుల్లో 1×4, 2×6) చెలరేగడంతో మొదట పంజాబ్ 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఛేదనలో హర్‌ప్రీత్ (3/19) స్పిన్ మాయలో పడి బెంగళూరు 8 వికెట్లకు 145 పరుగులే చేసి ఓడింది. రవి బిష్ణోయ్ (2/17) కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. విరాట్ కోహ్లీ (35; 34 బంతుల్లో 3×4, 1×6) టాప్ స్కోరర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications