ఆ విషయంలో విరాట్ కోహ్లీకి సరిలేరు: హర్షల్ పటేల్

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సారథి విరాట్ కోహ్లీపై ఆ జట్టు స్టార్ బౌలర్ హర్షల్ పటేల్ ప్రశంసల జల్లు కురిపించాడు. బౌలర్లను అర్థం చేసుకునే విషయంలో కోహ్లీని మించిన వారులేరని కొనియాడాడు. బౌలర్లను సరిగ్గా అర్థం చేసుకుంటాడని, ప్రతికూల పరిస్థితుల్లో కూడా అండగా నిలుస్తాడని తెలిపాడు.
కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్దాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. బబుల్‌ను చీల్చుకొని ఆటగాళ్లకు సోకిన వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందడంతో బీసీసీఐ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. దాంతో ఆటగాళ్లంతా తమ స్వస్థలలాకు వెళ్లిపోయారు.

విరాట్ మెసేజ్‌తో..
అయితే ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఆర్‌సీబీకి బదిలీ అయిన హర్షల్ పటేల్ దుమ్ములేపాడు. అద్భుత బౌలింగ్‌తో ఆర్‌సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. లీగ్ వాయిదా పడే సమయానికి ఏడు మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. అయితే విరాట్ కోహ్లీ మద్దతుతోనే తాను రాణించానని తాజాగా హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షల్ పటేల్ చెప్పుకొచ్చాడు.
'నన్ను జట్టులోకి తీసుకున్న రోజే.. 'జట్టులోకి స్వాగతం, మీరూ ఇక్కడ ఆడబోతున్నారు'అంటూ విరాట్ కోహ్లీ నుంచి ఒక సందేశం వచ్చింది. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నేను ఆడటానికి, నన్ను నేను నిరూపించుకోవడానికి ఇదే సరైన టీమ్ అనిపించింది.

బౌలర్లకు పూర్తి స్వేచ్చ...
ఇక బౌలర్లకు కోహ్లీ పూర్తి స్వేచ్చినిస్తాడు. ఏ విధంగా బౌలింగ్ చేస్తామన్న అంగీకరిస్తాడు. ఒక్కోసారి మన ప్రణాళికలు అమలు చేయడంలో విఫలమైనా.. అతను అర్థం చేసుకుంటాడు. ఆ రోజు బ్యాట్స్‌మెన్‌ది అని సర్ధి చెబుతాడు. తప్పిదాలపై సమీక్షకు కూర్చునప్పుడు కూడా చేయాల్సిన దాని గురించే మాట్లాడుతాడు తప్పా జరిగిపోయిన విషయాన్ని అస్సలు ప్రస్తావించాడు.'అని హర్షల్ పటేల్ చెప్పుకొచ్చాడు.
2012 నుంచి ఐపీఎల్లో ఆడుతున్న హర్షల్ పటేల్.. ఇప్పటి వరకు సరైన అవకాశాలను అందుకోలేకపోయాడు. ఈ సారి మాత్రం ముంబైతో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లోనే సూపర్బ్ బౌలింగ్‌తో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో జట్టులో కీలక బౌలర్‌గా కొనసాగాడు.

ఏబీడీ కంటే మంచిగా చెప్పెదెవరు?
ఏబీ డివిలియర్స్ కూడా మంచి సలహాలిచ్చాడని హర్షల్ పటేల్ చెప్పుకొచ్చాడు. 'మ్యాచ్ పరిస్థితులు, బౌలర్లు చేసే తప్పిదాల గురించి ఏబీ డివిలియర్స్ కంటే మంచిగా చెప్పెదేవరు? అతను చాలా తక్కువగా మాట్లాడుతాడు. కానీ ఓ ఆటగాడు తీవ్రంగా కష్టపడుతున్నాడని గ్రహిస్తే మాత్రం అతని అండగా నిలుస్తాడు. నా బౌలింగ్‌ను కూడా ఏడు, ఎనిమిది ఓవర్ల వరకు గమనించాడు. ఆ తర్వాత నాకు కొన్ని చిట్కాలు చెప్పాడు. వికెట్ ఎలా ఉందని, బ్యాట్స్‌మెన్ ఎలా ఆడుతున్నారని, ఎలాంటి బంతులు వేయాలనే సలహాలిచ్చాడు.'అని హర్షల్ పటేల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications