For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: 'నా వయసు 20 ఏళ్లు కాదు 40 ఏళ్లు.. విజయవంతం కావాలంటే ఏం చేయాలో తెలుసు'

IPL 2021: Harbhajan Singh reveals why he is didt play IPL 2020 in UAE.
IPL 2021 : KKR's Harbhajan Singh Reveals Why He Pulled Out Of IPL 2020 In UAE

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నుంచి తాను ఎందుకు తప్పుకున్నాడో తెలిపాడు టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్. కరోనా వైరస్ నేపథ్యంలో కుటుంబ భద్రత గురించి ఆలోచించే యూఏఈలో ఐపీఎల్ ఆడలేదని భజ్జీ తెలిపాడు. ఇక తన ఏజ్ 20 ఏళ్లు కాదని, 40 ఏళ్ల వయసులో విజయవంతం కావాలంటే ఏం చేయాలో తెలుసన్నాడు. కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న హ‌ర్భ‌జ‌న్.. ఐపీఎల్ 2021లో కోల్‌తా నైట్ రైడర్స్ (కేకేఆర్) త‌ర‌పున బ‌రిలోకి దిగ‌నున్నాడు.

కుటుంబం కోసమే:

కుటుంబం కోసమే:

తాజాగా హ‌ర్భ‌జ‌న్ సింగ్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... '2020లో దుబాయ్‌లో ఐపీఎల్‌ జరిగినప్పుడు కుటుంబ భద్రతను దృష్టిలో పెట్టుకునే టోర్నీ నుంచి వైదొలిగా. స్వదేశానికి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు కఠిన క్వారంటైన్‌లో ఉన్నా. కానీ ఈ సంవత్సరం మన దేశంలోనే లీగ్‌ జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితులకు అలవాటు పడడంతో టోర్నీలో పాల్గొంటున్నా. కరోనా టీకా కూడా రావడంతో నా భార్య గీతానే ఆడమని ప్రోత్సహించింది' అని తెలిపాడు. గత మూడేళ్లుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌లో కొనసాగిన భజ్జీని.. జనవరిలో ఆ జట్టు వదిలేసిన సంగతి తెలిసిందే. చివరిసారి 2019 ఐపీఎల్‌ ఫైనల్లో ఆడిన హర్భజన్..‌ అప్పటి నుంచీ ఒక్క మ్యాచ్‌ కూడా‌ ఆడలేదు.

అతడి సారథ్యంలో పునరాగమనం చేయడం నా అదృష్టం.. ఐపీఎల్‌లో ఏం చేయాలో తెలుసు: పుజారా

ఎలా ఆడాలో బాగా తెలుసు:

ఎలా ఆడాలో బాగా తెలుసు:

'2019 ఐపీఎల్‌కు ముందు దేశవాళీ టోర్నీల్లో పెద్దగా పాల్గొనకపోయినా.. ఆ సీజన్లో అద్భుతంగా రాణించా. ఇప్పుడు కూడా అలానే రాణిస్తానని నమ్మకంగా ఉన్నా. పోటీ క్రికెట్లో పాల్గొని చాలా రోజులు అయింది. అయితే ఈ స్థాయిలో ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు. కోల్‌కతాకు మంచి జట్టు ఉంది. రాహుల్‌ త్రిపాఠి, నితీష్‌ రాణా, దినేష్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రసెల్ లాంటి మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు. సత్తా చాటేందుకు యువకులు కూడా ఉన్నారు. కప్ గెలుస్తాం' అని హ‌ర్భ‌జ‌న్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు.

నా వయసు 20 ఏళ్లు కాదు.. 40 ఏళ్లు:

నా వయసు 20 ఏళ్లు కాదు.. 40 ఏళ్లు:

'ఎందుకు భజ్జీ ఇంకా ఆడుతున్నాడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అది వారి అభిప్రాయం. నేను ఆడాలనుకుంటున్నా.. ఆడతా. ఎవరికీ నేనెంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. బాగా ఆడాలన్నదే నా ఉద్దేశం. నాకంటూ కొన్ని ప్రమాణాలు నెలకొల్పుకున్నా. వాటిని అందుకోలేకపోతే నన్ను నేనే నిందించుకుంటా. ఇప్పుడు నా వయసు 20 ఏళ్లు కాదు. 40 ఏళ్లు. అయితే ఈ వయసులో విజయవంతం కావాలంటే ఏం చేయాలో తెలుసు' అని హ‌ర్భ‌జ‌న్ చెప్పుకోచ్చాడు. ఐపీఎల్ 2021 మినీ వేలంలో కోల్‌కతా రూ.2 కోట్లకు భజ్జీని దక్కించుకున్న సంగతి తెలిసిందే.

160 మ్యాచ్‌లు.. 150 వికెట్లు:

160 మ్యాచ్‌లు.. 150 వికెట్లు:

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 160 మ్యాచ్‌లాడిన హర్భజన్ సింగ్‌ మొత్తం 150 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. 2018 నుంచీ చెన్నై తరఫున ఆడుతున్న భజ్జీ.. 2019 సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఆ జట్టు ఫైనల్‌ చేరడంలో తనవంతు పాత్ర పోషించాడు. అయితే వ్యక్తిగత కారణాలతో గతేడాది యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో హర్భజన్‌ ఆడలేదు. ఈ నేపథ్యంలోనే జనవరిలో చెన్నై అతడిని వదిలేసుకుంది. దాంతో కోల్‌కతా కొనుగోలు చేసింది.

Story first published: Thursday, April 1, 2021, 10:02 [IST]
Other articles published on Apr 1, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+