Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ వీడియో చూస్తే ప్రతీ ఆర్‌సీబీ ఫ్యాన్ రోమాలు నిక్కబొడుస్తాయి.. డోన్ట్ మిస్ ఇట్!

IPL 2021: Goose Bumping Video For RCB fans In 3 Idiots Version, Dont Miss It

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు( ఆర్‌సీబీ) జైత్రయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి టేబుల్ టాపర్‌గా నిలిచిన కోహ్లీసేన.. ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో దూసుకెళ్తుంది. వేలానికే ముందే ప్రణాళికలు రచించిన ఆ జట్టు తొలుత టీమ్‌ను బలోపేతం చేసుకుంది. వేలంలో కోట్లు కుమ్మరించి ఆసీస్ విధ్వంసకర వీరుడు గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసింది. ఆల్‌రౌండర్ కైల్ జెమీసన్, డానియల్ క్రిస్టియన్‌లను తీసుకొని బ్యాటింగ్ డెప్త్‌ను పెంచుకుంది. ఇక ఢిల్లీ నుంచి హర్షల్ పటేల్‌ను తీసుకొని బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకుంది. ప్రస్తుతం ఆ జట్టు చాలా బ్యాలెన్సింగ్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్ టీమ్‌కు ట్రంప్ కార్డులా మారాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో రాణించి విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఫస్ట్ మూడు మ్యాచ్‌లు గెలవడం ఆర్‌సీబీకి ఇదే తొలిసారి. దాంతో ఆ టీమ్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఎడిటింగ్ నైపుణ్యానికి పనిచెబుతూ స్పూఫ్ వీడియోలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే తెలుగు ఆల్‌టైమ్ సూపర్ హిట్ 'ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో .. ఎర్రెర్రని దీ జెండెన్నియల్లో'సాంగ్‌తో రూపొందించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుండగా.. తాజాగా బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'త్రీ ఇడియట్స్' సినిమాలోని ఓ సీన్‌తో రూపొందించిన స్పూఫ్ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది.
ఐపీఎల్ 2021 సీజన్ పాయింట్స్ టేబుల్‌ను ఉద్దేశించి క్రియేట్ చేసిన వీడియో.. ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

త్రీ ఇడియట్స్ సినిమాలో ఆమిర్ ఖాన్, అతని స్నేహితులిద్దరు వార్షిక పరీక్ష ఫలితాలను చూసే సీన్‌ను ఐపీఎల్ 2021 సీజన్ పాయింట్స్ టేబుల్‌కు ఆపాదిస్తూ ఎడిట్ చేశారు. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచే ఆమిర్ ఖాన్‌ను ఆర్‌సీబీ టీమ్‌గా వర్ణించి.. అతని స్నేహితులను సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌లుగా పేర్కొన్నారు. ఇక ఆ సినిమాలోని కాలేజ్ ప్రిన్సిపాల్‌ను ముంబై ఇండియన్స్‌గా.. బట్టి పట్టి చదివే క్యారక్టర్‌ను చెన్నైగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Story first published: Wednesday, April 21, 2021, 14:10 [IST]
Other articles published on Apr 21, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+