IPL 2021 వేలానికి ముందే ఆర్‌సీబీ క్యాప్ అందుకున్నా.. ఆ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు: గ్లేన్ మ్యాక్స్‌వెల్

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ వేలానికి ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) క్యాప్ అందుకున్నానని ఆ జట్టు ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా విధ్వంసకర ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ తెలిపాడు. ఫిబ్రవరిలో చెన్నై వేదికగా జరిగిన ఈ మినీ వేలంలో మ్యాక్సీ కోసం ఫ్రాంచైజీలన్నీ పోటీపడిన విషయం తెలిసిందే. చివరకు ఆర్‌సీబీ రూ.14.25 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. అయితే తమ ప్రణాళికల్లో భాగంగా ముందస్తు వ్యూహం ప్రకారమే ఈ ఆసీస్ ఆల్‌రౌండర్‌ను తీసుకున్నామని ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మ్యాక్సీ కోసం ఇతర ఫ్రాంచైజీల నుంచి పోటీ ఎదురైనా.. అతన్ని దక్కించుకోవాలని ముందే నిర్ణయించుకున్నామన్నాడు. మ్యాక్సీ కోసం ఎంత ధరనైనా చెల్లించాలని డిసైడయ్యామని చెప్పాడు.
జంపా చేతుల మీదుగా..
అసలు వేలానికి ముందు రోజు ఏమి జరిగిందనే విషయాన్ని మ్యాక్స్‌వెల్ తాజాగా వెల్లడించాడు. ' ఇదొక ఫన్నీ స్టోరీ. ఐపీఎల్ వేలానికి అంతా ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో నా సహచర ఆటగాడు ఆడమ్ జంపా, నేను న్యూజిలాండ్ పర్యటలో ఉన్నాం. క్వారంటైన్‌లో ఉంటూ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ సమయంలో జంపా తన వద్దనున్న ఆర్‌సీబీ క్యాప్‌ను బ్యాగ్‌లో నుంచి తీసి నా తలపై పెట్టి ఓ ఫోటో తీసాడు. దాన్ని ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి పంపాడు. ఆ ఫొటోకు జతగా 'అప్పుడే ఇతనికి నేను తొలి క్యాప్ అందజేసాను. కంగ్రాట్స్'అనే ఓ మెస్సేజ్ కూడా పంపాడు. దానికి విరాట్.. మీరు ఇడియట్స్ అంటూ బదులిచ్చాడు.

ఇడియట్స్ అని తిట్టిన కోహ్లీ..
ఇది వేలానికి ముందు జరిగింది. అలా నేను వేలానికి ముందే ఆర్‌సీబీలోకి వచ్చా. కానీ వేలంలో ఆర్‌సీబీకి దక్కకపోతే ఏంటనే అనుమానం నాలో మొదలైంది. ఎందుకంటే వేలానికి ముందే ఆర్‌సీబీ క్యాప్ పెట్టుకుని దిగిన ఫోటోను కోహ్లీకి పంపాం. ఈ విషయంపై జంపా, నేను కోహ్లీతో చాట్ చేశా. అలా ఏమీ ఉండదు అని కోహ్లీ భరోసా ఇచ్చాడు'అని మ్యాక్స్‌వెల్ ఆర్సీబీ బోల్డ్ డైరీస్‌లో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను ఆ జట్టు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

నమ్మకాన్ని నిలబెట్టిన మ్యాక్సీ..
ఇక ప్రతీ సీజన్‌లో దారుణంగా విఫలమైన మ్యాక్సీకి అంత ధర వెచ్చించడంపై మాజీ క్రికెటర్లు ఆర్‌సీబీపై విమర్శలు గుప్పించాడు. అతని వల్ల జట్టుకు ఎలాంటి ఉపయోగం ఉండదని కామెంట్ చేశారు. కానీ మ్యాక్సీ టీమ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి చేజింగ్‌లో జట్టుకు అండగా నిలిచాడు. గత సీజన్‌లో కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టని మ్యాక్సీ.. ఈసారి ఫస్ట్ మ్యాచ్‌లోనే రెండు సిక్స్‌లు బాదాడు. ఇందులో ఓసిక్స్ అయితే ఏకంగా మైదానం పైకప్పుపై పడింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 వికెట్ల తేడాతో నెగ్గి లీగ్‌లో బోణీ కొట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications