For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఒక్క కారణంతోనే కేదార్ జాదవ్‌ను ధోనీ వదిలేశాడు: గౌతం గంభీర్

IPL 2021: Gautam Gambhir says Kedar Jadhav Is Released Only Because Of His Price Tag

న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన కనబర్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌లో సమూల మార్పులుంటాయని అంతా భావించారు. కానీ సీఎస్‌కే కేవలం ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే వదులుకొని అందర్ని ఆశ్యర్యపరిచింది. ఇందులో షేన్‌ వాట్సన్‌ ఇదివరకే రిటైరయ్యాడు. టీమిండియా బ్యాట్స్‌మన్‌ కేదార్‌ జాదవ్‌ను కూడా సీఎస్‌కే వదులుకుంది. అయితే కేదార్‌ను చెన్నై జట్టు పక్కనపెట్టడానికి అతని ఫామ్‌ మాత్రమే కారణం కాదని మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. అతనికి రూ.7.8 కోట్లు చెల్లించలేకే వదిలేసిందని, అదే రూ.3 లేదా 4 కోట్లు పారితోషకమైతే రిటైన్డ్‌ చేసుకునేదని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

సరైన వ్యూహం..

సరైన వ్యూహం..

ఇది ధోనీ వ్యూహాత్మకంగా వేసిన ఎత్తుగడని ఈ బీజేపి ఎంపీ కొనియాడాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ.. అతను కేవలం ఒక సీజన్‌ గురించే మాత్రమే ఆలోచిస్తాడని చెప్పాడు.'చెన్నై సరైన నిర్ణయం తీసుకుంది. జట్టును పునరుద్ధరించడమంటే జట్టు మొత్తాన్ని మార్చాల్సిన అవసరం లేదు. అంతేగాక గత సీజన్‌లో సీఎస్‌కే ప్రదర్శన మరీ అంత పేలవంగా లేదు. ఆ జట్టుపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ప్రతిసారీ ప్లేఆఫ్‌కు చేరేవాళ్లు. అందుకే చెన్నై జట్టు పటిష్టంగా లేదని, ఆటగాళ్లందరినీ మార్చాలని అందరూ భావించారు. కానీ ఆ జట్టు కేవలం అయిదుగురు ఆటగాళ్లను మాత్రమే వదలుకుంది'' అని గంభీర్‌ తెలిపాడు.

ధోనీ స్పెషల్ ఇది..

ధోనీ స్పెషల్ ఇది..

'ధోనీ ప్రత్యేకత ఇదే. అతను దేని గురించి మరీ లోతుగా ఆలోచించడు. ప్రస్తుత సీజన్‌ వరకు మాత్రమే ఆలోచిస్తాడు. పియూష్ చావ్లాకు అధిక ధర వెచ్చించాల్సి వస్తుందన్న కారణంతోనే విడిచిపెట్టింది. కరణ్ శర్మ, ఇమ్రాన్ తాహిర్‌ను అంటిపెట్టుకుంది. కేదార్‌ జాదవ్‌ కూడా అంతే. అతడి పారితోషకం వల్లే రిటైన్డ్‌ చేసుకోలేదు. కేదార్‌ ధర రూ.3-4 కోట్లు అయితే.. అతడిని ధోనీ మరో సీజన్‌ వరకు కొనసాగించేవాడు'అని పేర్కొన్నాడు.

ఆర్‌సీబీలోనిది ఇదే..

ఆర్‌సీబీలోనిది ఇదే..

'మరోవైపు బెంగళూరు పది మంది ఆటగాళ్లను వదులుకుంది. గత సీజన్‌లో వాళ్లు ప్లేఆఫ్స్‌కు కూడా చేరారు. ఐపీఎల్‌లో సీఎస్‌కే విజయంతమవుతుండటానికి కారణం వాళ్ల ఆలోచనలే. జట్టులో ఆడే 11 మంది ఆటగాళ్లతో పాటు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉండే అందరి ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తారు. సీఎస్‌కే, ఆర్‌సీబీ జట్టుకు తేడా ఇదే'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. చెన్నై జట్టు కేదార్ జాదవ్‌, షేన్‌ వాట్సన్ (రిటైర్డ్‌), పియూష్‌ చావ్లా, మురళీ విజయ్‌, మోను కుమార్‌, హర్భజన్‌ సింగ్‌ను వదిలేయగా.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. అత్యధికంగా 10 మందిని వదలుకుంది. క్రిస్‌ మోరిస్‌, ఆరోన్‌ ఫించ్‌, మొయిన్‌ అలీ, ఉదాన, శివమ్‌ దూబె, ఉమేశ్‌ యాదవ్‌, పవన్‌ నేగి, గుర్‌కీరత్‌లకు ఉద్వాసన పలికింది.

Story first published: Tuesday, January 26, 2021, 12:24 [IST]
Other articles published on Jan 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+