For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC v SRH: నన్ను చాలా నిరాశపరిచాడు.. అశ్విన్‌ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి: గంభీర్

IPL 2021: Gautam Gambhir says DC spinner Ravichandran Ashwin disappointed me in SRH match

దుబాయ్: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తనను చాలా నిరాశపరిచాడు అని భారత మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్ అన్నాడు. అశ్విన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. యాష్ ఇప్పుడు ప్రపంచంలోనే మేటి ఆఫ్‌ స్పిన్నర్‌ అని, అలాంటిది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ స్థాయిలో బౌలింగ్‌ చేయలేదని గౌతీ పేర్కొన్నాడు. బుధవారం దుబాయ్ వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 135 ప‌రుగుల‌ స్వ‌ల్ప లక్ష్యంతో బ‌రిలో దిగిన ఢిల్లీ.. రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో 139 పరుగులు చేసింది.

2.5 ఓవర్లు.. 22 పరుగులు

2.5 ఓవర్లు.. 22 పరుగులు

ఈ మ్యాచ్‌లో ముందుగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఆల్‌రౌండర్‌ మార్కస్ స్టోయినిస్‌ తొమ్మిదో ఓవర్‌ బౌలింగ్‌ చేశాడు. అయితే తొలి బంతి వేయగానే స్టోయినిస్‌ గాయం కారణంగా మైదానాన్ని వీడాడు. అనంతరం బంతి అందుకున్న స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆ ఓవర్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత మరో రెండు ఓవర్లు వేశాడు.

మొత్తంగా యాష్ 2.5 ఓవర్లు బౌలింగ్‌ చేసి 22 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అశ్విన్‌ బౌలింగ్‌ చేసేటప్పుడు వివిధ వేరియేషన్స్‌ చూపించాడు. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్‌ ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ యాష్ బౌలింగ్ తనను నిరాశపరిచింది అని పేర్కొన్నాడు.

ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి

ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి

'రవిచంద్రన్‌ అశ్విన్‌ తొలుత ఆఫ్‌ స్పిన్నర్‌ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. యాష్ బౌలింగ్‌ చేసేటప్పటికే ప్రత్యర్థి జట్టు కొన్ని వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో అశ్విన్ తన సహజసిద్ధమైన బౌలింగ్‌ చేయాల్సి ఉంది. అతడు చాలా కాలంగా సరైన క్రికెట్‌ ఆడలేదనే విషయం నిజమే. ఇంగ్లండ్‌తో ఆడిన నాలుగు టెస్టుల్లో అవకాశం రాలేదు, ప్రాక్టీస్‌ లేకపోవడం కూడా అర్థం చేసుకోవాలి. ఏ మ్యాచ్‌లో ఉండే ఒత్తిడి ఆ మ్యాచ్‌కు ఉంటుంది.

యాష్ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టకముందే ఆఫ్‌ స్పిన్‌ వేయాల్సింది. అశ్విన్‌ టెస్టుల మాదిరే బౌలింగ్‌ చేసి తన మార్క్‌ చూపించాల్సింది. తన బౌలింగ్‌లో ఎన్ని వైవిధ్యాలున్నా.. అతడు మాత్రం ఆఫ్‌ స్పిన్నరే' అని బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ అన్నాడు.

ENG vs PAK: 'ఐపీఎల్ కోసం అందుబాటులో ఉంటారు కానీ.. పాకిస్తాన్ పర్యటనకు మాత్రం వెళ్లారా'

అశ్విన్‌కు చోటివ్వలేదు

అశ్విన్‌కు చోటివ్వలేదు

అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021లో పాకిస్తాన్‌తో తలపడబోయే భారత జట్టును గౌతమ్ గంభీర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. గంభీర్ బ్యాటింగ్ ఆర్డర్‌లో అందరూ ఊహించిని వారినే ఎంచుకోగా.. స్పెసలిస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మాత్రం చోటివ్వలేదు.

రవీంద్ర జడేజాకు తోడుగా వరుణ్ చక్రవర్తిని రెండవ స్పిన్నర్‌గా గౌతీ ఎంచుకున్నాడు. ఈ ఇద్దరితో పాటు భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ మరియు జస్ప్రీత్ బుమ్రాల రూపంలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను ఎంచుకున్నాడు. అయితే భువనేశ్వర్ బదులుగా శార్దూల్ ఠాకూర్‌కు జట్టులో చోటిస్తే బాగుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. శార్దూల్ 15 మందిలో ఉంటే.. 8వ స్థానంలో అతడికే చోటిచ్చేవాడిని గంభీర్ అని చెప్పాడు.

బ్యాట్ ఝళిపించిన అయ్యర్, పంత్

బ్యాట్ ఝళిపించిన అయ్యర్, పంత్

135 పరుగుల మోస్తరు ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా (11; 8 బంతుల్లో 2x4) త్వరగానే ఔట్ అయ్యాడు. షా ఔట్ అయినా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (42; 37 బంతుల్లో 6x4, 1x6) స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించేశాడు. మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (47 నాటౌట్: 41 బంతుల్లో 2x4, 2x6)తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు.

ఆచితూచి ఆడుతూనే.. చెత్త బంతులను బౌండరీలు పంపాడు. ఈ జోడి రెండో వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో ధావన్ ఔటయ్యాడు. అయ్యర్ అండతో కెప్టెన్ రిషబ్ పంత్ (35 నాటౌట్; 21 బంతుల్లో 3x4, 2x6) భారీ షాట్లతో విరుచుకుపడి ఢిల్లీకి సునాయాస విజయాన్ని అందించాడు.

Story first published: Thursday, September 23, 2021, 18:41 [IST]
Other articles published on Sep 23, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+