Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs PAK: 'ఐపీఎల్ కోసం అందుబాటులో ఉంటారు కానీ.. పాకిస్తాన్ పర్యటనకు మాత్రం వెళ్లారా'

Available for IPL but not for Pakistan tour: Michael Atherton slams England players and ECB

లండన్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి దెబ్బ మీద దెబ్బ పడిన విషయం తెలిసిందే. భద్రతా కారణాలతో ముందుగా న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకోగా.. తాజాగా ఇంగ్లండ్ టీమ్ కూడా (పురుషులు, మహిళలు) పాక్ టూర్‌ను రద్దు చేసుకుంది. దీంతో పీసీబీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఉన్నపళంగా రెండు పెద్ద క్రికెట్ దేశాలు తమ పర్యటనను రద్దుచేసుకోవడంతో ఏం చేయని స్థితిలో పడింది పాక్. ఈ విషయంపై పాకిస్తాన్ బోర్డు సహా మాజీలు, ఆటగాళ్లు గుర్రుగా ఉన్నారు. ఇది చాలా అన్యాయమని తమ అసహనం వ్యక్తం చేశారు.

ఐపీఎల్‌కు అందుబాటులో ఉండేలా

ఐపీఎల్‌కు అందుబాటులో ఉండేలా

తాజాగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) తీరును ఇంగ్లీష్ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ అథర్టన్‌ తప్పుబట్టాడు. ఆటగాళ్ల సంక్షేమం కోసమని పాకిస్థాన్‌ పర్యటనను రద్దుచేసుకున్న ఈసీబీ.. వారిని ఐపీఎల్‌ 2021కు మాత్రం ఎలా అనుమతిస్తుందని ఆయన ప్రశ్నించాడు.

'మూడు నెలల పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లకు దేశం తరఫున ఆడాల్సిన అవసరం లేకుండా.. ఐపీఎల్‌కు అందుబాటులో ఉండేలా ఈసీబీ ప్లాన్ చేసింది. తప్పనిసరిగా సంవత్సరంలో మూడు నెలలు ఐపీఎల్ కోసం ఈసీబీ షెడ్యూల్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈసీబీ వారి సంక్షేమం గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది' అని ది టైమ్‌లో రాసిన ఓ కథనంలో మైకేల్‌ అథర్టన్‌ పేర్కొన్నాడు.

ఎందుకు అనుమతిస్తున్నారు

ఎందుకు అనుమతిస్తున్నారు

'ఓవైపు ఆటగాళ్ల క్షేమం కోసమని పాకిస్థాన్‌ పర్యటనను ఈసీబీ పెద్దలు రద్దు చేశారు. మరోవైపు బయో బబుల్‌ ఇబ్బందులు, అలసట ప్రభావం ఏంటో తెలిసి కూడా ఆటగాళ్లను ఐపీఎల్‌ 2021లో ఆడేందుకు ఎందుకు అనుమతిస్తున్నారు?. ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఆడుతున్న ఇంగ్లండ్ ప్లేయర్స్ ఇప్పుడు నాకౌట్ దశలకు అందుబాటులో ఉంటారు.

ఇది భారత్ మరియు ఇంగ్లండ్‌లకు ప్రయోజనం చేసేదే. పాకిస్తాన్‌ మాత్రం ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఈ నిర్ణయం దక్షిణాఫ్రికా నుంచి ఇంగ్లండ్ వైదొలగడం, భారత్‌ మాంచెస్టర్‌ టెస్టు నుంచి విరమించుకోవడం కంటే చెత్తది' అని మైకేల్‌ అథర్టన్‌ అన్నాడు.

MI vs KKR Dream11 Prediction: డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! ప్లేయింగ్ ఎలెవన్ అప్‌డేట్!!

మరోసారి నిరాశే మిగిలింది

మరోసారి నిరాశే మిగిలింది

భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించడంపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ట్విట్టర్ వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 'మరోసారి నిరాశే మిగిలింది. క్రికెట్ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తుంటే.. ఇతరులు మాత్రం కాదనుకుంటున్నారు.

ఈ ఎదురుదెబ్బల నుంచి బయటపడి నిలదొక్కుకోవడమే కాకుండా మరింతగా అభివృద్ధి చెందుతాం. ఇన్ షా అల్లా' అని బాబర్ ట్వీట్ చేశాడు. పీసీబీ చైర్మన్ రమీజ్‌ రాజా కూడా ట్విటర్‌లోనూ స్పందించాడు. 'ఇంగ్లండ్ బోర్డు తమ బాధ్యతల నుంచి తప్పుకుంది. అంతేకాదు అవసరమైన సమయంలో స్నేహపూర్వకమైన బోర్డుతో తమ క్రికెట్‌ అనుబంధానికి బీటలు వేసుకుంది. ఈసీబీ చర్యలు నన్ను నిరాశపరిచాయి.

అయితే మేం ఎలాగైనా ఈ పరిస్థితుల నుంచి బయటపడతాం. ఇది పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు ఓ మేలుకొలుపు. పాక్ ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా తయారై.. ఇతర జట్లు కారణాలేవీ చెప్పకుండా మాతో పోటీపడేలా చేస్తాం' అని ఆవేదన వ్యక్తం చేశాడు.

Story first published: Thursday, September 23, 2021, 17:30 [IST]
Other articles published on Sep 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+