న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs RCB: ఔటైన అసహనం.. కుర్చీపై విరాట్ కోహ్లీ కోపం! (వీడియో)

 IPL 2021: Frustrated Virat Kohli hits chair with his bat after getting out vs SRH

చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆ కోపాన్ని డగౌట్‌లోని కుర్చీపై తీర్చుకున్నాడు. మైదానం వీడుతున్న క్రమంలో తనకు ఎదురుగా ఉన్న కుర్చీని బ్యాట్‌తో బాదాడు. ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ ఇంత అసహనానికి గురవ్వడం చూడలేదు. తన చర్యతో పాత కోహ్లీని తలపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌‌చల్ చేస్తోంది.

అసలేం జరిగిందంటే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్(11), షబాజ్ అహ్మద్(14) విఫలమయ్యారు. పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారడంతో పరుగులు చేయడం కష్టమైంది. ఈ క్రమంలో ఆచితూచి ఆడిన విరాట్.. చూడ చక్కని షాట్లతో ఇన్నింగ్స్‌ ముందుకు నడిపించాడు. 29 బంతుల్లో 4 ఫోర్లతో 33 రన్స్ చేసి క్రీజులో కుదురుకున్నట్లు కనిపించాడు. దాంతో తన గేమ్ గేర్ మార్చి ధాటిగా ఆడాలని భావించిన విరాట్.. జేసన్ హోల్డర్ వేసిన 13 ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు.

హోల్డర్ వేసిన కట్టర్‌ను విరాట్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. లాంగ్ లెగ్‌లో ఉన్న విజయ్ శంకర్ పరుగెత్తుకుంటూ వచ్చి అద్భుతంగా అందుకున్నాడు. దాంతో తీవ్ర నిరాశకు గురైన విరాట్.. మైదానం వీడే క్రమంలో డగౌట్‌లోని కుర్చిపై అతన అసహనాన్ని ప్రదర్శించాడు. ఆ కుర్చిని బ్యాట్‌తో బలంగా బాదాడు.

ఇక విరాట్ కోహ్లీ ఔటైన అనంతరం ఏబీ డివిలియర్స్(1), వాషింగ్టన్ సుందర్(8), డానియల్ క్రిస్టియన్(1) వరుస ఓవర్లలో పెవిలియన్ చేరగా.. క్రీజులోకి కైలీ జేమీసన్‌తో మ్యాక్స్‌వెల్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59) తన ట్రేడ్ మార్క్ షాట్స్‌‌తో హాఫ్ సెంచరీ సాధించాడు. మ్యాక్సీ సూపర్ ఫిఫ్టీతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 రన్స్ చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు, షబాజ్ నదీమ్, నటరాజన్, భువీ తలో వికెట్ దక్కించుకున్నారు.

Story first published: Wednesday, April 14, 2021, 22:17 [IST]
Other articles published on Apr 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X