IPL 2021కి శ్రేయస్ అయ్యర్ దూరం.. ఢిల్లీ కెప్టెన్సీ రేసులో ఐదుగురు! అవకాశం ఎవరికంటే?

పూణే: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఏకంగా నలుగురు స్టార్ ఆటగాళ్లు గాయపడ్డారు. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, యువ బ్యాట్స్‌మన్ సామ్ బిల్లింగ్స్ ఫీల్డింగ్ చేసే సమయంలో గాయపడ్డారు. అయితే అయ్యర్‌కు అయిన భుజం గాయం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. గాయం కారణంగా ఐపీఎల్ 2021 మొత్తానికి అతడు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం తీవ్రత దృష్ట్యా భుజానికి సర్జరీ చేయాల్సి ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

కెప్టెన్సీ రేసులో ఐదుగురు:
ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 ప్రారంభంకానున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును నడిపించే ఆటగాడి కోసం ప్రాంఛైజీ ఇప్పటికే చర్చలు మొదలెట్టింది. కెప్టెన్సీ కోసం ఐదుగురు ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. స్టీవ్ స్మిత్, పృథ్వీ షా, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అజింక్య రహానేలు పోటీలో ఉన్నారు. గత సీజన్‌లో పరుగుల వరద పారించిన ఢిల్లీ సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా కెప్టెన్సీ రేసులో ఉండే అవకాశం ఉంది. అయితే ధావన్‌కు జట్టును ముందుండి నడిపించే సత్తా ఉన్నా.. గతంలో ఎప్పుడూ సారథ్యం చేసిన దాఖలు లేవు. కాబట్టి ధావన్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చు.

స్టీవ్/షా:
రాజస్థాన్ రాయల్స్‌కు చాలా ఏళ్లుగా కెప్టెన్‌గా వ్యవహరించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను ఇటీవల వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకున్నది. శ్రేయస్ అయ్యర్ దూరమయితే స్మిత్‌కు పగ్గాలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఐపీఎల్ టోర్నీతో పాటు ఆస్ట్రేలియాకు సారథ్యం వహించిన అనుభవం అతని సొంతం. స్మిత్ తర్వాత పృథ్వీ షా ఢిల్లీ కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీ 2021లో ముంబైని ఛాంపియన్‌గా నిలిపాడు. భారత అండర్19 జట్టును నడిపించిన అనుభవం కూడా ఉంది.

పంత్3:
స్టీవ్ స్మిత్, పృథ్వీ షా తర్వాత ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు తాత్కాలిక సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. పంత్ ఇప్పటివరకు కెప్టెన్‌గా వ్యవహరించకపోయినా.. ఢిల్లీ యాజమాన్యం అతనికి ఓ అవకాశం ఇవ్వనుంది. వికెట్ల వెనుక నిలబడి బౌలర్లు మరియు ఫీల్డర్లకు మార్గనిర్దేశం చేయగలడు. అనుభవజ్ఞులైన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేదా అజింక్య రహానేలపై ఫ్రాంఛైజీ మొగ్గు చూపొచ్చు. కింగ్స్ పంజాబ్ జట్టుకు అశ్విన్, రాజస్థాన్ జట్టుకు రహానే కెప్టెన్‌గా ఉన్నారు. మరి ఢిల్లీ ప్రాంచైజీ ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు రికీ పాంటింగ్ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. త్వరలో కెప్టెన్సీపై ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించే వీలుంది.
ICC T20I Rankings: ర్యాంకింగ్స్ మెరుగుపర్చుకున్న కోహ్లీ, రోహిత్.. రాహుల్ వెనక్కి!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications