18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. ఆర్‌సీబీ ప్లేయర్ అరుదైన ఘనత!

అక్లాండ్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు గుడ్ న్యూస్. ఆ జట్టు నయా ప్లేయర్, న్యూజిలాండ్ యువ క్రికెటర్ ఫిన్ అలెన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన ఆఖరి టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ధాటైన బ్యాటింగ్‌తో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని టీ20ల్లో అత్యంత వేగంగా అర్థం శతకం నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఫిన్ అలెన్(29 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71) విధ్వంసంతో న్యూజిలాండ్ 65 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. దాంతో మూడు టీ20ల సిరీస్‌ను ఆతిథ్య జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.

ఏకపక్ష విజయం..
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను అంపైర్లు 10 ఓవర్లకు కుదించగా.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఫిన్ అలెన్‌కు అండగా ఓపెనర్ మార్టిన్ గప్టిల్(19 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లతో 44) ధాటిగా ఆడాడు. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన బంగ్లాదేశ్ 9.3 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో మహమ్మద్ నైమ్(19), సౌమ్య సర్కార్( 10), మోసెదెక్ హుస్సెన్(13) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో టిమ్ సౌథీ మూడు వికెట్లు తీయగా.. టాడ్ ఆస్ట్లే నాలుగు పడగొట్టాడు.

జోష్ ఫిలిప్ స్థానంలో..
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోష్ ఫిలిప్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2021 నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్ ఫిన్ అలెన్‌ను ఆర్‌సీబీ తీసుకున్న విషయం తెలిసిందే. జోష్ ఫిలిప్ కనీస ధర రూ.20 లక్షలనే ఫిన్ అలెన్‌కు చెల్లించనుంది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఫిన్ అలెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. దాంతో తదుపరి సీజన్‌లో ఆర్‌సీబీ ఓపెనర్‌గా ఫిన్ అలెన్‌ను ఆడించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

ధోనీ తరహాలో..
బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఫిన్ అలెన్... టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ తరహాలో ఫస్ట్ మ్యాచ్‌లోనే డకౌటయ్యాడు. ధోనీ కూడా బంగ్లాదేశ్‌పై ఫస్ట్ వన్డేలో రనౌటై డకౌట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇక సెకండ్ మ్యాచ్‌లో 17 పరుగులు చేసిన ఫిన్ అలెన్.. తాజా మ్యాచ్‌లో తన సత్తా చాటాడు. 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచకుపడ్డాడు. దాంతో బెంగళూరు జట్టుకు కొత్త ఓపెనర్ దొరికేశాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కోహ్లీతో కలిసి అతను ఇన్నింగ్స్ ఆరంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఆర్సీబీ బృందం ప్రాక్టీసు చేస్తోంది. ఏప్రిల్ 9న మొదలయ్యే సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications