For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 Final: రస్సెల్, రైనాకు దక్కని చోటు.. చెన్నైదే బ్యాటింగ్!

 Unchanged Kolkata opt to bowl against MS Dhoni-led Chennai

దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వికెట్ డ్రైగా ఉండటంతో పాటు డ్యూ ప్రభావం ఉండనున్న నేపథ్యంలోనే ఫీల్డింగ్ ఎంచుకున్నానని కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. ఎలాంటి మార్పుల్లేకుండానే ఈ మ్యాచ్ బరిలోకి దిగుతున్నామని మోర్గాన్ స్పష్టం చేశాడు. దాంతో విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.

ఇక తాము టాస్ గెలిచినా ఫీల్డింగ్ ఎంచుకున్నవాళ్లమని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ తెలిపాడు. ఎలాంటి మార్పుల్లేకుండా విన్నింగ్ టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నామన్నాడు. దాంతో కీలక మ్యాచ్‌లో కూడా సురేశ్ రైనాకు చోటు దక్కలేదు. ఇక టీ20ల్లో కెప్టెన్‌గా ధోనీకిది 300వ మ్యాచ్ కావడం విశేషం.

తొమ్మిదిసార్లు ఫైనల్‌ చేరిన సీఎస్‌కే నాలుగోసారి కప్‌ కొట్టాలని భావిస్తుండగా... ఓటములతో ఇంటిదారి పడుతుంది అనుకున్న కేకేఆర్‌ ఫైనల్‌ చేరి మూడోసారి చాంపియన్‌గా అవతరించాలని ఉవ్విళ్లూరుతోంది. నేటి మ్యాచ్‌ ప్రధానంగా చెన్నై బ్యాటింగ్‌కు, కోల్‌కతా బౌలింగ్‌కు మధ్య అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో సీఎస్‌కే- కేకేఆర్‌ 25సార్లు ముఖాముఖి తలపడగా...చెన్నై 16 సార్లు, కోల్‌కతా 8 సార్లు గెలిచాయి. ఇరు జట్లు తొలిసారిగా దుబాయ్‌ వేదికగా ఫైనల్‌లో తలపడబోతున్నాయి.

ఈ పిచ్‌పై జరిగిన 105 టీ20 మ్యాచులలో మొదటి బ్యాటింగ్ చేసినవారు 41 విజయాలు సాధించగా... లక్ష్యాన్ని చేధనకు దిగిన టీం 63 విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో ఈ రికార్డును చెన్నై తిరుగరాస్తుందా? లేక కేకేఆర్ బౌలింగ్‌కు దాసోహం అంటుందా? చూడాలి.

తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మోయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్.

కోల్‌కతా నైట్ రైడర్స్: శుభమాన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి.

Story first published: Friday, October 15, 2021, 19:14 [IST]
Other articles published on Oct 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+