Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021 Final: పాపం చెన్నై.. శుభ్‌మన్‌గిల్‌ను రక్షించిన స్పైడీ క్యామ్!(వీడియో)

Shubman Gill Gets Out

దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ శుభ్‌మన్‌గిల్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఔటయ్యే ప్రమాదం నుంచి స్పైడీ క్యామ్ రక్షించింది. కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా రవీంద్ర జడేజా వేసిన 10వ ఓవర్ మూడో బంతిని గిల్ స్వీప్ షాట్ ఆడగా గాల్లోకి లేచిన బంతిని అంబటి రాయుడు అద్భుతంగా అందుకున్నాడు. దాంతో శుభ్‌మన్ ఔటయ్యాడని అంతా భావించారు. కానీ గాల్లోకి లేచిన బంతి స్పైడీ క్యామ్‌కు తగలడంతో అంపైర్ డెడ్ బాల్‌గా ప్రకటించాడు.

దాంతో శుభ్‌మన్ గిల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు. ఇక ఈ నిర్ణయం పట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మొయిన్ అలీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత రెండు బౌండరీలు బాదిన శుభ్‌మన్ జోరు కనబర్చాడు. అయితే శార్దూల్ ఠాకూర్ వేసిన 11వ ఓవర్‌లో వెంకటేశ్ అయ్యర్(50), నితీశ్ రాణా(0)లు ఔటవ్వడంతో మ్యాచ్‌ సీఎస్‌కే వైపు తిరిగింది. ఈ రెండు వికెట్లతో పతనం మొదలైంది. హజల్ వుడ్ బౌలింగ్ నరైన్(2) కూడా ఔటవ్వడంతో కేకేఆర్ కష్టాలు ఎక్కవయ్యాయి. దీప్ చాహర్ వేసిన 14వ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్(51) ఏల్బీగా వెనుదిరిగాడు. జడేజా వేసిన 15వ ఓవర్‌లో దినేశ్ కార్తీక్, షకీబ్ అల్ హసన్ ఔటవ్వడంతో కేకేఆర్ 120 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86) హాఫ్ సెంచరీతో రాణించగా.. మొయిన్ అలీ(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32), రాబిన్ ఊతప్ప(15 బంతుల్లో 3 సిక్స్‌లతో 31) కీలక పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు తీయగా.. శివం మావి ఓ వికెట్ తీశాడు.

Story first published: Friday, October 15, 2021, 23:12 [IST]
Other articles published on Oct 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+