For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 Final: సురేశ్ రైనాకు నోచాన్స్.. టైటిల్ ఫైట్‌లో కేకేఆర్‌తో బరిలోకి దిగే తుది జట్టు ఇదే!

IPL 2021 Final: No Suresh Raina, CSK Predicted Playing XI against KKR

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో తుది దశకు చేరుకుంది. దుబాయ్ వేదికగా దసరా పండుగ రోజున జరగనున్న టైటిల్ ఫైట్‌లో త్రీ టైమ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, టూ టైమ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. పేలవ ప్రదర్శనతో గతేడాది లీగ్ దశలోనే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్.. అద్భుత విజయాలతో ఈ సీజన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్ లీగ్‌లో దారుణంగా విఫలమైన కోల్‌కతా నైట్‌రైడర్స్ యూఏఈ గడ్డపై అన్యూహ విజయాలతో టైటిల్‌పోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగే టైటిల్ పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఇక ఈ మెగా ఫైట్‌లో బరిలోకి దిగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఓ లుక్కెద్దాం.

సురేశ్ రైనాకు నో చాన్స్..

సురేశ్ రైనాకు నో చాన్స్..

టైటిల్ పోరులో బరిలోకి దిగే చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు‌లో మార్పులకు ఆస్కారం లేదు. విన్నింగ్ టీమ్‌తోనే మహేంద్ర సింగ్ ధోనీ బరిలోకి దిగనున్నాడు. దాంతో సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనాకు నిరాశ తప్పేలా లేదు. యూఏఈ వేదికగా జరిగిన సెకండాఫ్‌లో దారుణంగా విఫలమైన రైనా.. ఫిట్‌నెస్ సమస్యలతో కూడా బాధపడ్డాడు. దాంతో అతన్ని పక్కన పెట్టిన ధోనీ.. సీనియర్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఊతప్పకు అవకాశం ఇచ్చాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ఊతప్ప.. కీలక క్వాలిఫయర్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో ఫైనల్లో కూడా అతన్నే కొనసాగించనున్నారు.

ఓపెనర్లుగా డుప్లెసిస్, రుతురాజ్..

ఓపెనర్లుగా డుప్లెసిస్, రుతురాజ్..

సీఎస్‌కే రాతను మార్చిన ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ ఫైనల్లో రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. డుప్లెసిస్ ఇప్పటికే 547 రన్స్ చేయగా.. రుతురాజ్ గైక్వాడ్ 602 పరుగులతో టాప్ బ్యాట్స్‌మన్‌ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్(626) కంటే 24 పరుగుల వెనుకంజలో ఉన్నాడు. ఫైనల్లో ఈ ఇద్దరు ఇదే జోరును కనబరిస్తే ప్రత్యర్థి టీమ్ కేకేఆర్‌కు కష్టాలు తప్పవు. మిడిలార్డర్‌లో ఊతప్ప, అంబటి రాయుడు, ధోనీ రానున్నారు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు ఉండవచ్చు. గత మ్యాచ్‌తో ఊతప్ప, ధోనీ టచ్‌లోకి రాగా.. రాయుడు రాణించాల్సిన అవసరం ఉంది.

మొయిన్ అలీ, బ్రావో, జడేజా..

మొయిన్ అలీ, బ్రావో, జడేజా..

ఇక సీఎస్‌కేకు మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా బలమైన ఆల్‌రౌండర్లుండటం కలిసొచ్చే అంశం. పైగా ఈ ముగ్గురు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటికే బ్రావో, జడేజా పలు మ్యాచ్ విన్నింగ్స్ నాక్స్ ఆడగా.. మొయిన్ అలీ పర్వాలేదనిపించాడు. ఈ త్రయం మరోసారి చెలరేగితే సీఎస్‌కే విజయం సులువు. ఇక పేసర్లుగా శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హజెల్ వుడ్ అద్భుతంగా రాణిస్తున్నారు. శార్దూల్ ఠాకూర్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. దీపక్, హజెల్ వుడ్ పర్వాలేదనిపిస్తున్నారు. అయితే వీరికి కూడా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అశం.

సీఎస్‌కే తుది జట్టు:

సీఎస్‌కే తుది జట్టు:

రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, రాబిన్ ఊతప్ప, మొయిన్ అలీ, మహేంద్ర సింగ్ ధోనీ(కీపర్, కెప్టెన్), అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హజెల్ వుడ్

Story first published: Thursday, October 14, 2021, 20:46 [IST]
Other articles published on Oct 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+