Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021 Final: కలిసొచ్చిన దసరా పండుగ.. టీఆర్‌పీ రేటింగ్స్‌లో స్టార్ స్పోర్ట్స్ ఆల్‌టైమ్ రికార్డు!

IPL 2021 Final: Highest TRP Rating In Hotstar For CSK vs KKR Match

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే), కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ రికార్డులు సృష్టించింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌ల కన్నా ఎక్కువ ప్రేక్షకాదరణ పొందింది. దసరా పర్వదినం స్టార్ స్పోర్ట్స్‌కు కలిసొచ్చింది. రెండు బలమైన జట్లు పోటీపడుతుండటంతో ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో టీఆర్‌పీ రేటింగ్స్, హాట్ స్టార్ వ్యూస్ వచ్చాయి. కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ కంటే ఎక్కవ ప్రేక్షకాదరణ ఈ మ్యాచ్ లభించడం విశేషం.
మాములుగా ఐపీఎల్ మ్యాచ్‌ జరిగితే డిస్నీ+హాట్ స్టార్‌లో 25 నుంచి 30 లక్షల మంది వీక్షిస్తారు. కానీ సీఎస్‌కే-కేకేఆర్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు 75 లక్షల మంది వీక్షించారు. ఐపీఎల్ చరిత్రలోనే హాట్ స్టార్‌లో రికార్డు వ్యూస్.

కేకేఆర్-ఆర్‌సీబీ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌ను 63 లక్షల మంది వీక్షించగా.. కేకేఆర్-డీసీ మధ్య జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు 65 లక్షలు ధాటింది. ఇక ఢిల్లీ, చెన్నై మధ్య జరిగిన క్వాలిఫయర్ 1‌లో ఈ సంఖ్య 50 లక్షలుగా నమోదైంది. ఏకకాంలో రెండు మ్యాచ్‌లు నిర్వహించగా.. ప్రేక్షకుల సంఖ్య ఓ మ్యాచ్‌కు 38 లక్షలు, మరో మ్యాచ్‌కు 16 లక్షలు నమోదైంది. దాంతో హాట్‌స్టార్ ఈ సీజన్ ఐపీఎల్‌లో రికార్డు స్థాయి వ్యూస్ అందుకుంది. ఇక టీఆర్‌పీ రేటింగ్స్‌లో కూడా స్టార్ స్పోర్ట్స్ చానెల్స్ దుమ్మురేపాయి. దసరా పండగా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సైతం మెగా ఫైనల్‌ను వీక్షించారు.

గతానికి భిన్నంగా మెరుగైన రికార్డు సాధించాయి. అన్నీ భాషల్లో అందుబాటులో ఉండటం.. పైగా ఆయా రాష్ట్రలకు చెందిన క్రికెటర్లను కామెంటేటర్లుగా ఎంచుకోవడంతో పాటు ప్రీ మ్యాచ్, పోస్ట్ మ్యాచ్ కార్యక్రమాలను నిర్వహించడం స్టార్ స్పోర్ట్స్‌కు కలిసొచ్చింది. చానెల్ మార్చకుండా చూసేలా చేసింది. రాను రాను ఈ సంఖ్య మరింత ఎక్కువ కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Story first published: Friday, October 15, 2021, 22:12 [IST]
Other articles published on Oct 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+