SRH మిడిలార్డర్ సమస్య తీరాలంటే అతన్ని జట్టులోకి తీసుకోవాలి: దీప్‌దాస్ గుప్తా

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్‌లో మిడిలార్డర్ బలహీనతతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా కీలక సలహా ఇచ్చాడు. ఆ సమస్యను అధిగమించాలంటే జట్టులోకి మనీష్ పాండేను తీసుకురావలన్నాడు. అందరూ అతని స్ట్రైక్‌రైట్‌ను విమర్శిస్తున్నారే తప్పా.. మనీష్ పాండే పరుగులు చేశాడనే విషయాన్ని గ్రహించడం లేదని చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మనీష్ పాండే జట్టులో ఉండటం చాలా అవసరమని, కేన్ విలియమ్సన్ జట్టులోకి రావడంతో అతను మరింత స్వేచ్చగా ఆడే అవకాశం ఉందన్నాడు. కేన్ మూడో స్థానంలో వస్తుండటంతో మనీష్ పాండేను గతంలో పంపించినట్లు నాలుగు, ఐదు స్థానాల్లో ఆడించవచ్చన్నాడు. భువనేశ్వర్ ఫిట్ అయితే అభిషేక్ శర్మను బెంచ్‌కే పరిమితం చేసి సుచిత్‌ను కొనసాగించాలన్నాడు.

మనీష్ పాండే రావాలి..
'సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ మనీష్ పాండేను జట్టులోకి తీసుకురావాలి. పాండేలాంటి అనుభవం కలిగిన ఆటగాడు హైదరాబాద్‌కు అవసరం. అయితే కేన్ విలియమ్సన్ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో పాండేను మూడో స్థానంలో ఆడించలేమనే విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ గతేడాది 4, 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేసిన మనీష్ పాండే అద్భుతంగా రాణించాడు. కాబట్టి ఈ ఏడాది కూడా అలానే అతన్ని బ్యాటింగ్‌కు పంపించాలి. మీరంతా అతని స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందని విమర్శించవచ్చు. కానీ అతను పరుగులు చేశాడనే విషయాన్ని మరవద్దు. కాబట్టి మనీష్ పాండే వంటి అపార నైపుణ్యం కలిగిన ఆటగాడు హైదరాబాద్‌కు ఆడటం చాలా ముఖ్యం. 'అని దీప్ దాస్ గుప్తా అభిప్రాయపడ్డాడు.

సుచిత్‌ను కొనసాగించాలి..
ఇక భువీ ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి వస్తే అభిషేక్ శర్మను బెంచ్‌కు పరిమితం చేయాలని ఈ మాజీ క్రికెటర్ సూచించాడు. జగదీష సుచిత్‌ను మాత్రం జట్టులో కొనసాగించాలని, అతను మంచి టెంపర్‌మెంట్‌తో ఆడుతున్నాడని తెలిపాడు. 'విరాట్ సింగ్, అభిషేక్ శర్మ, విజయ్ శంకర్ ఇప్పటికే చాలా అవకాశాలు పొందారు. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. భువనేశ్వర్ కుమార్ జట్టులోకి వస్తే మాత్రం సుచిత్‌ను పక్కనపెట్టవద్దు. ఎందుకంటే అతను మంచి టెంపర్‌మెంట్‌తో ఆడుతున్నాడు. గత మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. అతనికి ప్రత్యామ్నాయంగా ఉన్న అభిషేక్ శర్మను బెంచ్‌కు పరిమితం చేయాలి'అని దీప్‌దాస్ సూచించాడు.

రెండు హాఫ్ సెంచరీలు చేసినా..
మనీష్ పాండే ఈ సీజన్‌లో రెండు హాఫ్ సెంచరీలు సాధించినా జట్టుకు విజయాన్నందించలేకపోయాడు. అంతేకాకుండా అతని నెమ్మదైన బ్యాటింగ్, స్ట్రైక్‌రేట్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో అతన్ని జట్టు నుంచి తప్పించిన సన్‌రైజర్స్ టీమ్‌మేనేజ్‌మెంట్ విరాట్ సింగ్‌కు అవకాశం ఇచ్చింది. కానీ అతను ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. దారుణంగా విఫలమయ్యాడు. అతనితో పాటు కేదార్ జాదవ్ సైతం ఆశించిన ప్రదర్శనను కనబర్చలేకపోయాడు. ఇక హైదరాబాద్ 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒకటి గెలిచి పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉంది. మరికొద్ది సేపట్లో ఢిల్లీ వేదికగా ప్రారంభమయ్యే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications