
ఆ నలుగురుపైనే ఆశలు..
బెంగళూరు టీమ్‌లో ఓపెనర్ దేవదత్ పడిక్కల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. చెన్నైతో మ్యాచ్‌లో ఆ జట్టు మిడిలార్డర్ డొల్లతనం బయట పడింది. గ్లేన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ కూడా ఎడమచేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఇక వాషింగ్టన్ సుందర్, డేనియల్ క్రిస్టియాన్ తమ ఆల్‌రౌండర్ పాత్రకి న్యాయం చేయలేకపోతున్నారు. మొత్తంగా.. కోహ్లీ, పడిక్కల్, మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ ప్రదర్శనపైనే బెంగళూరు అతిగా ఆధారపడుతోంది. ఆ జట్టు గెలవాలంటే.. ఈ నలుగురిలో కనీసం ఇద్దరు క్లిక్ కావాల్సి ఉంది.
బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ ఆరంభంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తన బౌన్సర్, షార్ట్ పిచ్, ఆఫ్ కట్టర్స్‌తో ఇబ్బంది పెడుతున్నాడు. అతనికి జోడీగా నవదీప్ సైనీ గత మ్యాచ్‌లో వచ్చినప్పటికీ.. అతను అంచనాల్ని అందుకోలేకపోయాడు. ఇక స్పిన్నర్లు చాహల్, వాషింగ్టన్ సుందర్ కాస్త పొదుపుగానే బౌలింగ్ చేస్తున్నా మ్యాచ్‌లను మలుపు తిప్పే ప్రదర్శన కనబర్చడం లేదు. గత మ్యాచ్‌లో జడేజా దెబ్బకు ఒకే ఓవర్‌లో ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్న హర్షల్ పటేల్ ఎలా పుంజుకుంటాడనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక సైనీ స్థానంలో షాబాజ్ నదీమ్‌కు చోటు దక్కవచ్చు.

పటిష్టంగా ఢిల్లీ
ఇక, ఢిల్లీకి ఎలాంటి సమస్యల్లేవు. ఓపెనర్లు ధావన్, పృథ్వీ షా సూపర్ ఫామ్‌లో ఉండగా స్మిత్, కెప్టెన్ పంత్ వీరికి అండగా నిలుస్తున్నారు. కాకపోతే హెట్‌మైర్, మార్కస్ స్టాయినిస్ ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ చేయలేదు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చేరికతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతంగా మారింది. బౌలింగ్‌లో పేసర్ అవేష్ ఖాన్ అదరగొడుతుండగా.. కగిసో రబడా మాత్రం చివర్లో ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు.
ఇక స్పిన్నర్ అమిత్ మిశ్రాకి జోడీగా ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ రావడంతో.. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థికి చిక్కులు తప్పడం లేదు. కానీ.. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్ 2021 సీజన్ నుంచి వైదొలిగి ఇంటికి వెళ్లిపోవడం ఇప్పుడు ఆ జట్టుకి పెద్ద లోటులా కనిపిస్తోంది. అశ్విన్ స్థానంలో లలిత్ యాదవ్‌కు చోటు దక్కవచ్చు. హెట్‌మైర్ ప్లేస్‌లో అన్రిచ్ నోర్జ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

ముఖా ముఖి..
ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 25 మ్యాలు ఆడాయి. ఇందులో బెంగళూరు టీమ్ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 10 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మిగిలిన ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. గెలుపోటములే కాదు.. భారీ స్కోర్ల విషయంలోనూ ఢిల్లీపై బెంగళూరుదే ఆధిపత్యంలా కనిపిస్తోంది. ఢిల్లీపై ఇప్పటి వరకూ బెంగళూరు చేసిన అత్యధిక స్కోరు 215 పరుగులుకాగా.. బెంగళూరుపై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 196 పరుగులు మాత్రమే. అయితే.. ఆశ్చర్యకరంగా గత రెండు సీజన్లలోనూ కనీసం ఒక్కసారి కూడా ఢిల్లీని బెంగళూరు ఓడించలేకపోయింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీనే గెలుపొందడం విశేషం.

తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, స్టీవ్ స్మిత్, రిషభ్ పంత్(కెప్టె, కీపర్), మార్కస్ స్టోయినిస్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కగిసో రబడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నోర్జ్, అమిత్ మిశ్రా
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, డాని క్రిస్టియన్, కైల్ జెమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ యుజ్వేంద్ర చాహల్, నవ్‌దీప్ సైనీ/ షాబాజ్ నదీమ్
డ్రీమ్ 11 ప్రిడిక్షన్: ఏబీ డివిలియర్స్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్(కెప్టెన్), పృథ్వీ షా, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, అవేశ్ ఖాన్, కైల్ జెమీసన్, మహ్మద్ సిరాజ్


Click it and Unblock the Notifications












