For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs PBKS Preview:నోర్జ్ ఆగయా..దుర్భేద్యంగా ఢిల్లీ బౌలింగ్!కలవరపడుతున్న పంజాబ్!బ‌ర్త్ డే బాయ్ ఆడుకునేనా!

IPL 2021, DC vs PBKS Preview: Dream 11 Team Prediction, Playing 11 and pitch report

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో మరో రసవత్తర పోరుకి సమయం ఆసన్నమైంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ఈరోజు రాత్రి 7.30 గంటలకి ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఇరు జట్లకు ఇది మూడో మ్యాచ్. టోర్నీ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ని సునాయాసంగా ఓడించేసిన ఢిల్లీ.. రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఇక రాజస్థాన్‌పై మొదటి మ్యాచ్‌లోనే గెలిచిన పంజాబ్.. చెన్నై చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. రెండు జట్లు తమ చివరి మ్యాచులలో ఓడిపోవడంతో.. ఈ రోజు ఎలాగైనా గెలవాలని చూస్తున్నాయి. మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్లను ఓసారి పరిశీలిద్దాం.

బ‌ర్త్ డే బాయ్ మెరిస్తే

బ‌ర్త్ డే బాయ్ మెరిస్తే

పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. గతేడాది అదరగొట్టిన మయాంక్.. ఇంకా ఫామ్ అందుకోలేదు. కెప్టెన్ కేఎల్ రాహుల్, క్రిస్ ‌గేల్, దీపక్ హుడా మెరుపులు ఒక మ్యాచ్‌కే పరిమితమయ్యాయి. ముగ్గురు గాడిలో పడాల్సిన అవసరం ఉంది. బ‌ర్త్ డే బాయ్ రాహుల్ మరోసారి తన మార్క్ చూపిస్తే.. పంజాబ్ భారీ స్కోర్ చేస్తుంది. పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ రెండు మ్యాచ్‌ల్లోనూ పరుగులు చేయలేదు. అయితే యువ హిట్టర్ షారూక్ ఖాన్ ఫామ్‌లోకి రావడం కాస్త ఊరటనిచ్చే అంశం. పటిష్ట ఢిల్లీ పేస్ బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే.. టాప్ ఆర్డర్ ఎదురుదాడి చేయాల్సి ఉంటుంది.

 షమీకి ఒక్కడే

షమీకి ఒక్కడే

ఎప్పటిలానే పంజాబ్ కింగ్స్ బౌలింగ్ బలహీనత ఐపీఎల్ 2021లో కనిపిస్తోంది. ఫాస్ట్ బౌలర్‌ మహ్మద్ షమీకి ఒక్కడే పోరాడుతున్నాడు. అతడికి తోడు అర్షదీప్ సింగ్ రాణిస్తున్నా.. చివర్లో ఒత్తిడిని జయించలేకపోతున్నాడు. యువ పేసర్లు రిచర్డ్‌సన్, మెరాడిత్ భారీగా పరుగులు ఇస్తున్నారు. వీరికి తోడు స్పిన్నర్ మురగన్ అశ్విన్ కూడా ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు. దాంతో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని ఈ మ్యాచ్‌లో తీసుకునే అవకాశం ఉంది. గతేడాది బిష్ణోయ్‌ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. హిట్టర్లు ఉన్న ఢిల్లీని ఆపాలంటే .. పంజాబ్ బౌలర్లు కష్టపడాల్సిందే.

నోర్జ్ వచ్చేశాడు

నోర్జ్ వచ్చేశాడు

ఢిల్లీ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా దూకుడుగా ఆడగలరు. అయితే ఇద్దరూ ఫెయిలైతే టీమ్ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. కెప్టెన్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చాడు. ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఫెయిలవగా.. బౌలింగ్‌లోనూ తేలిపోతున్నాడు. అజింక్య రహానే కూడా జట్టుకి భారంగా మారాడు. ఇప్పటికే కగిసో రబాడ, క్రిస్ ‌వోక్స్‌తో ఢిల్లీ పేస్ దళం బలంగా ఉండగా.. అన్రిచ్ నోర్జ్ కూడా వచ్చేశాడు. దాంతో టామ్ కరన్‌పై వేటు పడనుంది. అవేష్ ఖాన్ వికెట్లు తీస్తున్నా.. ధారళంగా పరుగులిచ్చేస్తున్నాడు. ఇక ఆర్ శ్విన్ ఫామ్ అందుకోవాల్సి ఉంది.

రికార్డ్స్

రికార్డ్స్

ఐపీఎల్ టోర్నీ‌లో పంజాబ్, ఢిల్లీ ఇప్పటి వరకూ 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 15 మ్యాచ్‌ల్లో పంజాబ్ విజయం సాధించగా.. 11 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలుపొందింది. ఢిల్లీపై పంజాబ్ ఇప్పటి వరకూ చేసిన అత్యధిక స్కోరు 202 పరుగులు కాగా.. పంజాబ్‌పై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 231 పరుగులు. ఇక ఢిల్లీని పంజాబ్ ఓ మ్యాచ్‌లో 67 పరుగులకే ఆలౌట్ చేస్తే.. పంజాబ్ జట్టును ఢిల్లీ 104 పరుగులకు కట్టడిచేసింది. సాధారణంగా ముంబై పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. బౌండరీ కూడా చిన్నది కావడంతో పరుగుల వరద పారేది. కానీ ఐపీఎల్ 2021లో మాత్రం భారీగా రన్స్ రావడం లేదు. గత మ్యాచులు చూస్తే.. స్పిన్నర్లు కూడా రాణిస్తున్నారు.

తుది జట్లు:

తుది జట్లు:

ఢిల్లీ: శిఖర్ ధావన్, పృథ్వీ షా, అజింక్య రహానే, రిషబ్ పంత్, మార్కస్ స్టోయినిస్, లలిత్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, క్రిస్ వోక్స్, ఆర్ అశ్విన్, కగిసో రబాడ, అవెష్ ఖాన్.

పంజాబ్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, జే రిచర్డ్సన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, రిలే మెరాడిత్, అర్షదీప్ సింగ్.

డ్రీం 11 టీం:

కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), క్రిస్ గేల్, శిఖర్ ధావన్, పృథ్వీ షా, క్రిస్ వోక్స్, దీపక్ హుడా, మహ్మద్ షమీ, మెరాడిత్, కగిసో రబాడ (వైస్ కెప్టెన్), ఆర్ అశ్విన్.

RCB vs KKR:టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు.. ముగ్గురు ఆటగాళ్లతోనే బరిలోకి కోహ్లీసేన! క్రిస్టియన్ ఔట్!

Story first published: Sunday, April 18, 2021, 16:22 [IST]
Other articles published on Apr 18, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+