DCvsPBKS:ధావన్ పక్కకి వెళ్లిపోయినా..కోపాన్ని ప్రదర్శించిన షమీ! గబ్బర్ లైట్ తీసుకోవడంతో గొడవ జరగలేదు! లేదంటే?

ముంబై: ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (36 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలు చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (49 బంతుల్లో 92; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడగా.. పృథ్వీ షా (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టారు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన ధావన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

ఆధిపత్య పోరు
ఈ మ్యాచ్‌లోనూ ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్యాట్స్‌మెన్, బౌలర్ల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. ఈ ఐపీఎల్‌లో ఇప్పటికే మనం శామ్ కరన్, టామ్ కరన్ మధ్య ఆధిపత్య పోరు చూసాం. ఇక భారత క్రికెటర్లు మహ్మద్ షమీ, శిఖర్ ధావన్ మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఓ బంతికి సహనం కోల్పోయిన షమీ.. ధావన్ ఆడకుండా క్రీజు పక్కకి వెళ్లిపోయినా బంతిని విసిరి తన కోపాన్ని ప్రదర్శించాడు. అయితే ధావన్ లైట్ తీసుకోవడంతో ఎలాంటి గొడవ జరగలేదు. ఒకవేళ ధావన్ కూడా షమీ చేసిన దానికి ఆవేశపడుంటే.. పరిస్థితి మరోలా ఉండేది. విషయంలోకి వెళితే...

ధావన్ ఏకాగ్రత చెదిరింది
ఢిల్లీ లక్ష్య చేధనకు దిగింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన పేసర్ మహ్మద్ షమీ.. మూడో బంతిని విసిరేందుకు రన్నప్ తీసుకున్నాడు. షమీ రన్నప్ మధ్యలో ఉండానే స్టేడియంలోని సైట్ స్రీన్ వద్ద ఓ వ్యక్తి కనిపించడంతో.. బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ ఏకాగ్రత చెదిరింది. దాంతో ధావన్ క్రీజు పక్కకి వెళ్లిపోయాడు. వెంటనే ఫీల్డ్ అంపైర్ బౌలింగ్‌ని నిలిపివేయమని సిగ్నల్ ఇచ్చాడు. షమీ ఇదేమీ పట్టించుకోకుండా బంతిని ధావన్‌కి సమీపంలో విసిరాడు. ఈ ఘటనతో ఆశ్చర్యపోయిన గబ్బర్.. షమీ పైపు కాసేపు చూస్తూ కనిపించాడు. ఇక ఫీల్డ్ అంపైర్ ఆ బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించాడు.
గబ్బర్ హుందాతనం
ఐపీఎల్ 2014 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ మిచెల్ స్టార్క్ ఇలానే ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌పైకి బంతిని విసిరాడు. దాంతో సహనం కోల్పోయిన పొలార్డ్.. బ్యాట్‌ని స్టార్క్ పైకి విసిరాడు. అయితే ఆ బ్యాట్ పొలార్డ్‌కి సమీపంలోనే పడటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇక్కడ శిఖర్ ధావన్ ఎలాంటి ఆవేశపడకుండా హుందాతనం ప్రదర్శించాడు. ఉద్దేశపూర్వకంగానే మొహ్మద్ షమీ బంతి విసిరినా.. మౌనంగా ఉండిపోయాడు. దీంతో ధావన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

వెనకడుగు వేయడం లేదు
'చాలా రోజులుగా నా ఆట తీరు మెరుగుపరచుకునేందుకు కృషి చేస్తున్నా. ధాటిగా ఆడేందుకు వెనకడుగు వేయడం లేదు. కొత్తగా ప్రయత్నించడానికి భయపడను. నెట్స్‌లో ఎంత బాగా సాధన చేస్తానో.. మ్యాచుల్లోనూ అదే ఆట తీరు అమలు చేసేందుకు ప్రయత్నిస్తా. గత కొద్ది రోజులుగా లెగ్ సైడ్ షాట్స్ ఆడటం సాధన చేస్తున్నా. బౌలర్ల వేగాన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటూ ఆడేందుకు ప్రణాళిక వేస్తున్నా. ఒక్కో బౌలర్ బంతులకు ఎలా ఆడాలో ముందుగానే ఆలోచించుకుంటాను. దాన్నే అమలు చేస్తున్నా. ఇటీవల నా స్లాగ్ షాట్ బాగా మెరుగుపడింది. పృథ్వీ షాతో ఓపెనింగ్ ఆస్వాదిస్తున్నా' అని గబ్బర్ మ్యాచ్ అనంతరం చెప్పాడు.
DC vs PBKS: వైరల్ ఫొటోస్.. కేఎల్ రాహుల్‌కు స్పెషల్ విషెస్ చెప్పిన అతియా శెట్టి!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications