
అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ డ్రైగా ఉండటంతో పాటు డ్యూ ప్రభావం ఉండే అవకాశముందని, అందుకే తాను ఫీల్డింగ్ తీసుకుంటున్నట్లు ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. భుజం గాయం కారణంగా అమిత్ మిశ్రా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని అతని స్థానంలో లలిత్ యాదవ్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు. గత మ్యాచ్ ఉత్సాహాన్ని కొనసాగించేందుకు తమ సాయశక్తుల ప్రయత్నిస్తామని కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదన్నాడు.
నాలుగు పరాజయాల తర్వాత మళ్లీ గెలుపు రుచి చూసిన కోల్‌కతా అదే జోరుని కొనసాగించాలని చూస్తుండగా.. గత మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో ఓడిన ఢిల్లీ మళ్లీ గెలుపు బాట పట్టాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లలో కూడా భారీ హిట్టర్లు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడగా.. 14 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించింది. 11 మ్యాచ్‌ల్లో ఢిల్లీ విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
తుది జట్లు:
ఢిల్లీ: శిఖర్ ధావన్, పృథ్వీ షా, స్టీవ్ స్మిత్, రిషభ్ పంత్(కెప్టెన్/కీపర్), షిమ్రాన్ హిట్‌మెయర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, కగిసో రబడా, అవేష్ ఖాన్, ఇషాంత్ శర్మ, లలిత్ యాదవ్.
కోల్‌కతా: నితీశ్ రాణా, శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తీక్(కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శివమ్ మావి, పాట్ కమిన్స్, ప్రసీద్ క్రిష్ణ, వరుణ్ చక్రవర్తి.