రిషభ్ పంత్‌ను కన్విన్స్ చేసి మరి సూపర్ ఓవర్ వేసా: అక్షర్ పటేల్

చెన్నై: పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో కెప్టెన్ రిషభ్ పంత్‌ను కన్విన్స్ చేసి మరి సూపర్ ఓవర్ వేసానని ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తెలిపాడు. పైగా డేవిడ్ వార్నర్ లెఫ్టాండర్ కావడంతో తన బౌలింగ్ ఆడటానికి ఇబ్బంది పడతాడని గ్రహించి ఈ ధైర్యం చేశానన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఢిల్లీ తరపున అక్షర్ పటేల్ సూపర్ ఓవర్ వేయగా.. అతని స్పిన్ ఆడడంలో విఫలమైన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ రషీద్ ఖాన్ వేసిన ఆఖరి బంతికి సింగిల్ తీసి విజయాన్నందుకుంది.
'

కోచ్ నిర్ణయాన్ని కాదని..
ఈ మ్యాచ్ విజయానంతరం ఆవేశ్ ఖాన్‌తో చిట్ చాట్ చేసిన అక్షర్ పటేల్ సూపర్ ఓవర్ వేయడానికి గల కారణాన్ని వెల్లడించారు. వాస్తవానికి ఈ సూపర్ ఓవర్ తాను వేయాల్సిందని, కోచ్ రికీపాంటింగ్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడని ఆ ఆవేశ్ ఖాన్ తెలిపాడు. ఇక ''రిషబ్ పంత్ దగ్గరకు వెళ్లి ఏం చెప్పావని.. బంతి నీ చేతిలోకి ఎలా వచ్చిందో'' చెప్పాలని అక్షర్‌ను ప్రశ్నించాడు.
దీనికి అక్షర్ స్పందిస్తూ.. సూపర్ ఓవర్‌కు మొదట నీ పేరును పరిశీలించిన మాట వాస్తవం. అప్పటికే హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ కూడా ఆవేశ్ ఖాన్ సూపర్ ఓవర్ వేస్తాడని స్పష్టం చేశాడు.

పంత్‌ను కన్విన్స్ చేశా..
కానీ నేను పంత్ దగ్గరకు వెళ్లి.. ఈ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంది. పరుగులు చేయడానికి కష్టంగా ఉంది. బ్యాట్స్‌మన్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సమయంలో సూపర్ ఓవర్‌ను ఫాస్ట్ బౌలర్ కంటే స్పిన్ బౌలర్‌తో వేయడం సమంజసమని పంత్‌ను కన్విన్స్ చేశా. అందులోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి నా బౌలింగ్‌లో ఆడడానికి కాస్త ఇబ్బంది పడుతాడు. అందుకే సూపర్ ఓవర్ నేను వేస్తా అని పంత్‌కు తెలిపా'' అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
కేన్ పోరాటం వృథా
ఈ మ్యాచ్‌లో తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పృథ్వీ షా (39 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... రిషభ్ పంత్ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (25 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (51 బంతుల్లో 66 నాటౌట్; 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టు చివరి వరకు గెలుపు వేటలో నిలిచింది. జానీ బెయిర్‌స్టో (18 బంతుల్లో 38; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. చివరి బంతికి 2 పరుగులు చేస్తే గెలవాల్సిన రైజర్స్ సింగిల్‌కే పరిమితం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications