న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్ నన్ను రిటైన్ చేసుకోదు.. వేలంలోకి వస్తా: డేవిడ్ వార్నర్

 David Warner says Will Put My
IPL 2022 : SRH నన్ను రిటైన్ చేసుకోదు.. ఆ లాజిక్‌ నవ్వు తెప్పించింది..! || Oneindia Telugu

దుబాయ్: ఐపీఎల్ 2022 సీజన్‌ నేపథ్యంలో తనను సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకునే అవకాశం లేదని ఆ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఈ క్రమంలోనే వేలంలోకి వస్తానని చెప్పాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సుదీర్ఘకాలం ఆడిన వార్నర్.. 2016‌లో ఆ జట్టుకు టైటిల్ కూడా అందించాడు. ప్రతీ సీజన్‌లో 500 ప్లస్ రన్స్ చేసిన వార్నర్.. ఈ సీజన్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. రెండు దశల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. దాంతో కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయాడు. వార్నర్‌ స్థానంలో కేన్ విలియమ్సన్ సారథ్య బాధ్యతలు చేపట్టినా సన్‌రైజర్స్ తలరాత మాత్రం మారలేదు. సీజన్‌ను ఆ జట్టు ఆఖరి స్థానంతో ముగించింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో డేవిడ్ వార్నర్‌ ఉంటాడా? లేదా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉండేది. వార్నర్‌ను హైదరాబాద్‌ జట్టు రిటెయిన్ చేసుకుంటుందా? లేదా అనేదీ సందేహమే.

ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు సన్‌రైజర్స్ తనను అట్టిపెట్టుకుంటుందని మాత్రం తాను అనుకోవడం లేదని వార్నర్ పేర్కొన్నాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం వార్నర్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. వచ్చే సీజన్ మెగవేలంపై వార్నర్ స్పందిస్తూ..'ఆ నిర్ణయం మింగుపడని చేదు గుళికలాంటిది. అయితే నన్ను తప్పించడానికి చెప్పిన లాజిక్‌ నవ్వు తెప్పించింది. ఇద్దరు యువ ఆటగాళ్లు నా కంటే మెరుగ్గా ఆడారని.. నేను గేమ్ ఆడుతున్నప్పుడు సరైన దృక్పథంతో ఆడలేదని వారిని తీసుకున్నట్లు చెప్పారు. ఇక వచ్చే సీజన్‌ ఐపీఎల్‌ విషయానికొస్తే.. నన్ను సన్‌రైజర్స్‌ తమ వద్దే ఉంచుకుంటుందని అనుకోవడం లేదు. వచ్చే వేలంలో నా పేరును ఉంచుతా. ఇటీవల ఐపీఎల్ పరిణామాల నేపథ్యంలో సన్‌రైజర్స్ నన్ను రిటెయిన్ చేయడం కష్టమే. అందుకే కొత్త ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నా'' అని పేర్కొన్నాడు. మెగా ఆక్షన్‌ వచ్చే డిసెంబర్‌లోగానీ, జనవరిలో గానీ నిర్వహించే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి మెగావేలం తేదీలను ఖారారు చేయకపోయినప్పటికీ ఆటగాళ్ల రిటెన్షన్‌పై బోర్డు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పాలసీ ప్రకారం మెగా వేలానికి ముందు పాత జట్లు నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో ముగ్గురు భారత ఆటగాళ్లు, ఒక ఓవర్ సీస్ ప్లేయర్ లేదా ఇద్దరు భారత ప్లేయర్లు.. ఇద్దరు ఓవర్ సీస్ ప్లేయర్లను ఎంచుకోవచ్చు. ఇక భారత ఆటగాళ్ల విషయంలో క్యాప్, అన్ క్యాప్ ప్లేయర్లా? అనేది ఫ్రాంచైజీల ఇష్టం. మొత్తం క్యాప్ ప్లేయర్లను లేదా అన్ క్యాప్ ప్లేయర్లను, కలిపి కూడా తీసుకోవచ్చు.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్(42 బంతుల్లో 10 ఫోర్లతో 65)దుమ్మురేపాడు. తనదైన షాట్లతో అలరించిన ఈ ఆస్ట్రేలియా స్టార్.. చాలా రోజుల తర్వాత లయ అందుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది.

Story first published: Thursday, October 28, 2021, 23:55 [IST]
Other articles published on Oct 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X