For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డేవిడ్ వార్నర్‌కు ఘోర అవమానం.. డగౌట్‌కు నో పర్మీషన్! గ్యాలరీకే పరిమితం! (వీడియో)

David Warner Not Permitted
IPL 2021 : David Warner Not Allowed To SRH Dugout, Fans Unimpressed || Oneindia Telugu

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఘోర అవమానం జరిగింది. పేలవ బ్యాటింగ్‌తో కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కోల్పోయిన డేవిడ్ భాయ్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌కు హాజరయ్యాడు. అయితే మాజీ కెప్టెన్ అయిన డేవిడ్ భాయ్‌కు డగౌట్‌కు అనుమతి లభించలేదు. దాంతో అతను ప్రేక్షకుల గ్యాలరీకి పరిమితమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానిగా జట్టుకు మద్దతు తెలిపాడు. కానీ టీమ్ మరోసారి పేలవ ప్రదర్శనతో ఓటమిపాలవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. వార్నర్ ప్రేక్షకుల గ్యాలరీలో సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వార్నర్‌ను అలా చూసిన అతని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

మేనేజ్‌మెంట్‌తో విభేధాలు..

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన గత రెండు మ్యాచ్‌లకు కనీసం మైదానంలోకి కూడా రాని వార్నర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌మేనేజ్‌మెంట్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దాంతో వార్నర్-టీమ్ మేనేజ్‌మెంట్ మధ్య విభేదాలున్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా ఆరెంజ్ జెర్సీలో ఆడటం ఇదే చివరిసారి కావచ్చని కూడా వార్నర్ పోస్ట్ చేయడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. వచ్చే ఏడాది మెగా వేలం నేపథ్యంలో వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పేలవ బ్యాటింగ్‌తో..

పేలవ బ్యాటింగ్‌తో..

ఇక భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్‌లో దారుణంగా విఫలమైన డేవిడ్ భాయ్.. కెప్టెన్సీతో పాటు తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు. ఆ తర్వాత కరోనా కలకలంతో లీగ్ అర్థంతరంగా వాయిదా పడింది. ఇక నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత యూఏఈ వేదికగా లీగ్ రీస్టార్ట్ అవ్వగా.. ఆఖరి క్షణంలో ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో తప్పుకోవడంతో వార్నర్‌కు తుది జట్టులో చోటు ఖాయమైంది. కానీ అరబ్ గడ్డపైనా వార్నర్ పేలవ ప్రదర్శన కొనసాగింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అతను దారుణంగా విఫలమయ్యాడు. దాంతో టీమ్‌మేనేజ్‌మెంట్ అతనిపై వేటు వేసి ఇంగ్లండ్ క్రికెటర్ జాసన్‌రాయ్‌కు అవకాశం ఇచ్చింది.

డగౌట్‌కు నో పర్మీషన్..

డగౌట్‌కు నో పర్మీషన్..

అతను తన ఫస్ట్ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో వార్నర్‌కు అవకాశమే లేకుండాపోయింది. జట్టులో చోటు దక్కకపోయినా.. కనీసం టీమ్ డగౌట్‌లోనైనా వార్నర్ కనిపిస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఈ ఆసీస్ స్టార్ గత రెండు మ్యాచ్‌ల్లో డగౌట్‌లో కనిపించలేదు. పైగా మ్యాచ్ జరగుతుండగా.. హోటల్ గది నుంచి ఇన్‌స్టా స్టోరీలు పంచుకున్నాడు. తుది జట్టులో చోటు దక్కకపోయినా సీనియర్ ప్లేయర్‌గా.. జట్టుకు టైటిల్ అందించిన ఆటగాడిగా వార్నర్‌కు కనీసం డగౌట్‌లోనైనా అవకాశం ఇవ్వాల్సింది. డగౌట్లో ఉండేందుకు జట్టులోని 18 మందికి అవకాశం ఉంటుంది. కానీ వార్నర్‌కు ఆ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చోటివ్వలేదు. దాంతో చేసేదేం లేక వార్నర్ ప్లేక్షకుల గ్యాలరీలో సందడి చేశాడు. సెల్ఫీలు దిగుతూ మ్యాచ్‌ను ఆస్వాదించాడు.

సన్‌రైజర్స్ మళ్లీ..

సన్‌రైజర్స్ మళ్లీ..

కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో కూడా సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 115 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(26), అబ్దుల్ సమద్(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో టీమ్ సౌథీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తీ రెండేసి వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 116 పరుగులు చేసి నాలుగు బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది.

Story first published: Monday, October 4, 2021, 7:09 [IST]
Other articles published on Oct 4, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+