SRH మేనేజ్‌మెంట్‌పై డేవిడ్ వార్నర్ సెటైర్స్! ఏమన్నాడంటే!

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌కు ఐపీఎల్ 2021 సీజన్ ఓ పీడ కలలా మిగిలిపోయింది. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్‌లో దారుణంగా విఫలమైన డేవిడ్ భాయ్.. కెప్టెన్సీతో పాటు తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు. ఆ తర్వాత కరోనా కలకలంతో లీగ్ అర్థంతరంగా వాయిదా పడింది.
ఇక నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత యూఏఈ వేదికగా లీగ్ రీస్టార్ట్ అవ్వగా.. ఆఖరి క్షణంలో ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో తప్పుకోవడంతో వార్నర్‌కు తుది జట్టులో చోటు ఖాయమైంది. కానీ అరబ్ గడ్డపైనా వార్నర్ పేలవ ప్రదర్శన కొనసాగింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అతను దారుణంగా విఫలమయ్యాడు. దాంతో టీమ్‌మేనేజ్‌మెంట్ అతనిపై వేటు వేసి ఇంగ్లండ్ క్రికెటర్ జాసన్‌రాయ్‌కు అవకాశం ఇచ్చింది.

ముందు ఉండే వారికంటే..
అతను తన ఫస్ట్ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో వార్నర్‌కు అవకాశమే లేకుండాపోయింది. జట్టులో చోటు దక్కకపోయినా.. కనీసం టీమ్ డగౌట్‌లోనైనా వార్నర్ కనిపిస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఈ ఆసీస్ స్టార్ గత రెండు మ్యాచ్‌ల్లో డగౌట్‌లో కనిపించలేదు. పైగా మ్యాచ్ జరగుతుండగా.. హోటల్ గది నుంచి ఇన్‌స్టా స్టోరీలు పంచుకున్నాడు.
దాంతో హైదరాబాద్ టీమ్‌మేనేజ్‌మెంట్.. డేవిడ్ వార్నర్‌కు ఏ మాత్రం పడటం లేదని, వీరి మధ్య ఏదో జరుగుతుందనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. దీనికి తోడు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున తనకు ఇదే చివరి సీజన్ కావొచ్చని డేవిడ్ వార్నర్ ట్వీట్ చేయడం కూడా ఈ అమమానాలను మరింత బలపడేలా చేసింది. అయితే తాజాగా ఇన్‌స్టా వేదికగా వార్నర్ చేసిన పోస్ట్ విభేదాలు నిజమే అనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. పరోక్షంగా టీమ్‌మేనేజ్‌మెంట్‌కు వార్నర్ వార్నింగ్ ఇచ్చినట్లుంది. 'ముందు నీతో ఉన్నవారికంటే వెనుకలా నీకు అండగా నిలిచేవారెవరో తెలుసుకోవడం ముఖ్యం'అనే వ్యాఖ్యను షేర్ చేస్తూ సూపర్‌గా ఉందనే ఏమోజీలను పెట్టాడు.

8 మ్యాచ్‌ల్లో 195
ఈ సీజన్‌లో వార్నర్ ఇప్పటివరకు 8 మ్యాచుల్లో 107 స్ట్రైక్ రేట్‌తో 195 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఆడిన అన్ని ఐపీఎల్ సీజనల్లో కంటే.. 2021లోనే అతి తక్కువ పరుగులు సాధించాడు. అయితే ప్రతీ ఆటగాడికి ఇలాంటి దశ ఒకటి ఉంటుంది. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ మాత్రం అతడి పట్ల కఠినంగా వ్యవహరించింది. ముందుగా కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా.. ఆపై ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా చోటివ్వలేదు. తొలి దశలో ఓ మ్యాచులో వార్నర్ ఆడలేదు. అప్పుడు ఆట మధ్యలో ఆటగాళ్లకు డ్రింక్స్ తీసుకువెళ్లాడు.

డగౌట్‌లో కూడా చోటివ్వలేదు..
రెండో దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగు మ్యాచులు ఆడగా.. రెండింటిలో డేవిడ్ వార్నర్ ఆడలేదు. వార్నర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకపోవడంతో హోటల్‌లోనే గడిపినట్లు తెలుస్తుంది. కనీసం డగౌట్లో (డగౌట్లో ఉండేందుకు జట్టులోని 18 మందికి స్థానం ఉంటుంది) కూడా ఎక్కడా కనిపించలేదు. సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్, వార్నర్‌కు మధ్యలో ఏం జరిగిందో పూర్తిగా తెలియదు. ఏదేమైనా ఎస్‌ఆర్‌హెచ్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజాగా వార్నర్ చేసిన ఓ ట్వీట్ కూడా అభిమానులను షాక్‌కు గురిచేసింది. 'దురదృష్టవశాత్తు నేను మళ్లీ స్టేడియంలోకి రాను. కానీ సన్‌రైజర్స్ జట్టుకు మద్దతు మాత్రం ఇస్తూనే ఉండండి' అని వార్నర్ పేర్కొనడం పెద్ద ప్రశ్నగా మారింది. దీంతో సన్‌రైజర్స్ నుంచి తప్పుకుని వేరే ప్రాంచైజీకి వెళ్తానని వార్నర్ చెప్పకనే చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications