
కేన్ మామ సర్‌ప్రైజ్..
డేవిడ్ వార్నర్ రాకపై ముందే అప్‌డేట్ రాగా.. చెప్పాపెట్టకుండా వచ్చి కేన్‌మామ అందరికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. వీరితోనే బ్రాడ్ హడిన్ కూడా చెన్నైకి చేరుకున్నాడు. వీరి రాకతో సన్‌రైజర్స్ క్యాంప్‌లో జోష్ వచ్చేసింది. ఇక గ్యాంగ్ లీడ్ వచ్చాడంటూ అనే సాంగ్‌తో సన్‌రైజర్స్ మరో ట్వీట్ చేసింది. అలాగే ఇప్పుడే వచ్చానని తెలుపుతున్న కేన్ విలియమ్సన్ వీడియోను ట్వీట్ చేసింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం వీరు వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు.

కలవర పెడుతున్న కేన్ గాయం..
మోచేతి గాయంతో బాధపడుతున్న కేన్ విలియమ్సన్ ఐపీఎల్ 2021 సీజన్ ఆడటం డౌటేనని వార్తలొచ్చాయి. ఈ గాయం కారణంగానే విలియమ్సన్ బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. ఈ వెటరన్ క్రికెటర్ ఎడమ మోచేతిలో చిన్న టియర్ ఉందని, అతనికి రిహాబిలిటేషన్ అవసరమని న్యూజిలాండ్ క్రికెట్ మెడికల్ మేనేజర్ డేలే షాకెల్ నెలరోజుల క్రితం తెలిపిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో కేన్ విలియమ్సన్ ఫిట్‌గా ఉండటం తమకెంతో అవసరమని, అతన్ని ఆడించి రిస్క్ చేయలేమన్నాడు. దాంతో కేన్ మామ ఐపీఎల్ ఆడటం కూడా కష్టమేనని అంతా భావించారు. ఈ క్రమంలో అటు సన్‌రైజర్స్ కానీ, ఇటు కేన్ గానీ ఐపీఎల్ ఆడటం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దాంతో అతని రాకపై అందరూ అనుమానంగానే ఉన్నారు. కానీ కేన్ చెప్పపెట్టకుండా వచ్చి అందర్ని ఆశ్చర్యపరిచాడు.

నా డార్లింగ్‌తో లాస్ట్ పెగ్..
రెండు రోజుల ముందే డేవిడ్ వార్నర్ తన రాకపై అప్‌డేట్ ఇచ్చాడు. గురువారం ఇన్‌స్టా వేదికగా ఓ ఫొటోను పంచుకున్న ఈ డాషింగ్ ఓపెనర్.. 'నా డార్లింగ్‌తో ఇదే నా చివరి పెగ్. అదృష్టవశాత్తు కొన్ని నెలలు కుటుంబంతో గడిపే సమయం దొరికింది. కానీ ఇప్పుడు బ్యాగ్‌లు సర్దుకొని భారత్‌కు వెళ్లే సమయం ఆసన్నమైంది. లవ్ యూ డార్లింగ్.. మిస్ యూ'అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటో నెట్టింట వైరల్ అయింది. అంతకు ముందు తన కూతుళ్లతో గడిపిన ఫొటోలను పంచుకున్నాడు.

ఏప్రిల్ 11 నుంచి షురూ..
ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరిగే ఈ క్యాషిరిచ్ లీగ్ కోసం ఫ్రాంచైజీలన్నీ సమయాత్తం అవుతున్నాయి. ఇప్పటికే ఆటగాళ్లంతా ఆయా జట్లతో కలిసారు. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం లీగ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అయితే బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు మాత్రం క్వారంటైన్‌ను మినహాయించారు. చెన్నై వేదికగా జరిగే సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది. ఏప్రిల్ 11న ఇదే వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.


Click it and Unblock the Notifications












