న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీపై అనుచిత వ్యాఖ్యలు.. డానియల్‌ క్రిస్టియన్‌కు ఆర్‌సీబీ వార్నింగ్‌.. వీడియో డిలీట్!

IPL 2021: Dan Christian Issued Warning By RCB For Breach Of Contract

అహ్మదాబాద్: రాయల్ ‌చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్ డానియల్ క్రిస్టియన్ టీమ్‌మేనేజ్‌మెంట్ ఆగ్రహానికి గురయ్యాడు. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టియన్ తన కెప్టెన్ విరాట్ కోహ్లీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కాంట్రాక్ట్ నిబంధనలు ఉల్లంఘించడంతో తీవ్ర దుమారం రేగింది. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆర్‌సీబీ ఫ్రాంచైజీ క్రిస్టియన్‌ను మందలించింది. దాంతో ఆ వీడియోను తొలగించేలా చేసిన క్రిస్టియన్ తన తప్పును సరిదిద్దుకున్నాడు.

 అసలేం జరిగిందంటే..?

అసలేం జరిగిందంటే..?

'ద గ్రేడ్‌ క్రికెటర్‌'యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో క్రిస్టియన్ కెప్టెన్ కోహ్లీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఐపీఎల్‌ కంటే డబ్యూటీసీ(వరల్డ్‌ టెస్టు చాంపియన్‌) ఫైనల్‌ ముఖ్యమని ఇప్పుడు దానిపైనే కన్నేశాడని పేర్కొన్నాడు. ఆ క్రమంలోనే నెట్స్‌లో న్యూజిలాండ్‌ క్రికెటర్‌ కైల్ జెమీసన్‌ వద్ద ఉన్న డ్యూక్‌ బాల్స్‌ను వేయమని కోరినట్లు తెలిపాడు. అయితే దానికి జెమీసన్‌ నిరాకరించాడని వివాదాస్పద రీతీలో చెప్పుకొచ్చాడు. మరొకవైపు ఆర్‌సీబీ సమావేశాలకు పూర్తి స్థాయిలో హాజరుకావడం లేదని, ఏదో కొన్నింటికి మాత్రమే వస్తున్నాడని ఆ ఇంటర్య్యూలో పేర్కొన్నాడు.

హెచ్చరించిన ఆర్‌సీబీ..

హెచ్చరించిన ఆర్‌సీబీ..

ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఒక జట్టు కెప్టెన్‌ను అవమానపరిచేలా ఉన్న ఆ వీడియోపై ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే క్రిస్టియన్‌కు వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆ వీడియోను యూట్యూబ్‌ చానల్‌ నుంచి డిలీట్‌ చేయమని క్రిస్టియన్‌ స్వయంగా 'ద గ్రేడ్‌ క్రికెటర్‌'కు విన్నవించుకున్నాడు. ఆ చానల్‌ హోస్ట్‌ అయిన సామ్‌ పెర్రీని ఆ వీడియోను తీసేయమని క్రిస్టియన్‌ అభ్యర్థించాడట.

డానియల్‌పై గౌరవంతో..

డానియల్‌పై గౌరవంతో..

ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా వేదిక తెలుపుతూ వీడియో తీసేయడాని గల కారణాన్ని తెలియజేశాడు. 'మాకు క్రిస్టియన్‌ నుంచి రిక్వెస్ట్‌ వచ్చింది. తన ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను తీసేయమని కోరాడు. ఇది ఐపీఎల్‌ నిబంధనల కాంట్రాక్ట్‌ ఉల్లంఘనలో భాగమట. అందుకు ఆ వీడియోను యూట్యూబ్‌ చానెల్‌లో వద్దన్నాడు. డానియల్‌పై గౌరవంతో దాన్ని తీసేశాం' అని పెర్రీ తెలిపారు. కాగా, ఐపీఎల్‌ ముగిసిన తర్వాత భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు మాంచెస్టర్‌ వేదికగా డబ్యూటీసీ ఫైనల్లో తలపడనున్నాయి. జెమీసన్‌ న్యూజిలాండ్‌ క్రికెటర్‌ కావడంతో పాటు అక్కడ డ్యూక్‌ బాల్స్‌ను వినియోగించనున్నారు. గతేడాది ఆరంభంలో జెమీసన్ బౌలింగ్‌లో కోహ్లీ తడబడ్డాడు.

Story first published: Saturday, May 1, 2021, 21:15 [IST]
Other articles published on May 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X