Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs SRH: చెలరేగిన కేన్ మామ.. చెన్నై ముందు భారీ టార్గెట్!

Kane Williamson, Kedar Jadhav cameos lift Sunrisers to 171

న్యూఢిల్లీ: మనీష్ పాండే(46 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 61), డేవిడ్ వార్నర్( 55 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీలకు తోడుగా కేన్ విలియమ్సన్(10 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ 172 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. డేవిడ్ వార్నర్, మనీష్ పాండే రెండో వికెట్‌కు 106 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 171 రన్స్ చేసింది. కేదార్ జాదవ్(4 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 12 నాటౌట్) రాణించాడు. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా.. సామ్ కరన్ ఓ వికెట్ తీశాడు.

నిరాశ పరిచిన బెయిర్‌స్టో..

నిరాశ పరిచిన బెయిర్‌స్టో..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(7)ను సామ్ కరన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండేతో కలిసి డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అడపాదడపా బౌండరీలు బాదడంతో సన్‌రైజర్స్ పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 47 రన్స్ చేసింది. అనంతరం చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఈ జోడీ క్విక్ సింగిల్స్‌తో రన్‌రేట్ తగ్గకుండా జాగ్రత్త పడింది. మొయిన్ అలీ వేసిన 10వ ఓవర్‌లో పాండే మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. అనంతరం జడేజా కట్టుదిట్టంగా వేయగా.. మిగతా ఓవర్లలో ఈ జోడీ బౌండరీలు రాబట్టింది.

పాండే, వార్నర్ హాఫ్ సెంచరీలు..

పాండే, వార్నర్ హాఫ్ సెంచరీలు..

జడేజా వేసిన 14 ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసిన పాండే 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లుంగి ఎంగిడి వేసిన ఆ మరుసటి ఓవర్‌ నాలుగో బంతికి డబుల్ తీసిన వార్నర్ టీ20 క్రికెట్‌లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. గేల్, పొలార్డ్, షోయబ్ మాలిక్ తర్వాత ఈ ఘనతను అందుకున్న నాలుగో ప్లేయర్‌గా నిలిచాడు. ఇక జడేజా వేసిన 16 ఓవర్ ఐదో బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టిన వార్నర్ 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఐపీఎల్‌లో 50 హాఫ్ సెంచరీల ఘనతతో పాటు 200 సిక్సర్ల క్లబ్‌లో డేవిడ్ భాయ్ చేరాడు.

కేన్ మామ మెరుపులు..

కేన్ మామ మెరుపులు..

17వ ఓవర్‌ను శార్దూల్ ఠాకూర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 6 పరుగులే వచ్చాయి. దాంతో ఒత్తిడికి గురైన వార్నర్... ఎంగిడి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి జడేజాకు చిక్కాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 106 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి కేన్ మామ రాగా.. పాండే ఫోర్ కొట్టి ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ మరుసటి బంతికే ఫాఫ్ డూప్లెసిస్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. వైడ్ లాంగాన్ దిశగా అతను కొట్టిన భారీ షాట్‌ను డూప్లెసిస్ సూపర్ డైవ్‌తో అందుకున్నాడు. ఇక ఠాకూర్ వేసిన 19వ ఓవర్‌లో కేన్ మామ వరుసగా 4, 6, 4, 4‌తో వరుసగా నాలుగు బౌండరీలు బాదడంతో 20 పరుగులొచ్చాయి. చివరి ఓవర్‌లో కేదార్ జాదవ్ ఓ సిక్స్, ఫోర్ కొట్టడంతో సన్‌రైజర్స్ 171 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివరి రెండు ఓవర్లలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ 33 పరుగులు చేసింది.

Story first published: Wednesday, April 28, 2021, 21:28 [IST]
Other articles published on Apr 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+