Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs SRH:ప్చ్.. హైదరాబాద్‌కు తప్పని ఓటమి.. చెన్నై అలవోక విజయం!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగోతుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(44 బంతుల్లో 12 ఫోర్లతో 75), ఫాఫ్ డూప్లెసిస్(38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో చెన్నై 9 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 171 రన్స్ చేసింది. మనీష్ పాండే(46 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 61), డేవిడ్ వార్నర్( 55 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీలతో రాణించగా.. చివర్లో కేన్ విలియమ్సన్(10 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 నాటౌట్) మెరుపులు మెరిపించారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 173 రన్స్ చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే మూడు వికెట్లు తీయగా.. మిగతా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. ఈ విజయంతో చెన్నై పాయింట్స్ టేబుల్లో టాప్‌లోకి దూసుకెళ్లగా.. సన్‌రైజర్స్ అట్టడగును కొనసాగుతుంది.

సూపర్ స్టార్ట్..

సూపర్ స్టార్ట్..

172 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డూప్లెసిస్ మంచి శుభారంభాన్ని అందించారు. ఖలీల్ అహ్మద్ సెకండ్ ఓవర్‌లో డూప్లెసిస్ బౌండరీల ఖాతా తెరవగా.. సందీప్ శర్మ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో ఫోర్ కొట్టి గైక్వాడ్ టచ్‌లోకి వచ్చాడు. ఇక అక్కడి నుంచి ప్రతీ ఓవర్ బౌండరీ రాబట్టిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ఖలీల్, సిద్దార్థ్ కౌల్ బౌలింగ్‌లో ఈ జోడీ రెండేసి బౌండరీలు కొట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. అనంతరం అదే జోరు కనబర్చిన ఈ జోడీ.. రషీద్ ఖాన్‌ను గౌరవించినా ఇతర బౌలర్లను ఆడుకుంది. సుచిత్ వేసిన 9వ ఓవర్‌లో గైక్వాడ్ ఫోర్ కొట్టగా.. డూప్లెసిస్ 6, 4తో జోరు కనబర్చాడు.

 డూప్లెసిస్, గైక్వాడ్ హాఫ్ సెంచరీలు..

డూప్లెసిస్, గైక్వాడ్ హాఫ్ సెంచరీలు..

సిద్దార్థ్ కౌల్ వేసిన 11 ఓవర్‌ ఆఖరి బంతికి డబుల్ తీసిన డూప్లెసిస్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే ఫోర్ కొట్టిన గైక్వాడ్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అదే జోరులో ఆ మరుసటి రెండు బంతులను బౌండరీలకు తరలించాడు. రషీద్ ఖాన్ వేసిన 13వ ఓవర్‌లో మరో మూడు బౌండరీలు బాది జోరు కనబర్చిన గైక్వాడ్ .. ఆ మరుసటి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 129 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఫోర్‌తో ముగించిన రైనా..

ఫోర్‌తో ముగించిన రైనా..

ఇక క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ.. రషీద్ ఖాన్ వేసిన 15వ ఓవర్‌లో రెండు ఫోర్లతో ధాటిగా ఆడాడు. కానీ ఆ మరుసటి బంతికే కేదార్ జాదవ్ చేతికి చిక్కి వెనుదిరిగాడు. ఆ వెంటనే డూప్లెసిస్ కూడా ఎల్బీగా పెవిలియన్ చేరాడు. అతను రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. కానీ చేజింగ్ రన్ రేట్ చాలా తక్కువగా ఉండటంతో మ్యాచ్ మొత్తం చెన్నై వైపు మారింది. చెన్నై విజయానికి 30 బంతుల్లో 24 పరుగులు కావాల్సి ఉండగా.. క్రీజులోకి వచ్చిన జడేజా, సురేశ్ రైనా ఆచితూచి ఆడుతూ లక్ష్యాన్ని పూర్తి చేశారు. సిద్దార్థ్ కౌల్ వేసిన 18వ ఓవర్‌లో రెండు బౌండరీలు బాదిన రైనా సందీప్ శర్మ ఓవర్‌లో మరో ఫోర్ బాది మ్యాచ్‌ను ముగించాడు.

Story first published: Wednesday, April 28, 2021, 23:13 [IST]
Other articles published on Apr 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+