IPL 2021: ఐసోలేషన్‌లో చెన్నై ఆటగాళ్లు.. రేపటి మ్యాచ్ వాయిదా!

ఢిల్లీ: ఇద్దరు ప్లేయర్లు, ఓ కోచ్ కరోనా బారిన పడడంతో ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఓ మ్యాచ్‌ను వాయిదా వేసిన బోర్డు.. లీగ్‌ను కొనసాగిస్తామని అంటున్నప్పటికీ అది సజావుగా సాగేలా లేదు. మరికొన్ని మ్యాచ్‌లను రీ షెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది. ఢిల్లీ వేదికగా రేపు( బుధవారం) రాజస్తాన్-చెన్నై మ్యాచ్ కూడా ఆగిపోవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి.
సీఎస్‌కే ప్లేయర్లంతా నెగెటివ్‌గా తేలినప్పటికీ కోచ్ బాలాజీతో క్లోజ్ కాంటాక్ట్ నేపథ్యంలో వాళ్లు కూడా ఆరు రోజుల ఐసోలేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. 'సాధారణంగా వైరస్ బాడీలోకి ఎంటరైన ఐదు లేదా ఆరో రోజే లక్షణాలు బయట పడతాయి. కాబట్టి ఢిల్లీలో తర్వాతి రెండు మ్యాచ్‌లు జరపడం సురక్షితమేనా? కాదా? అన్న చర్చలు జరుగుతున్నాయి'అని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

బాలాజీకి పాజిటీవ్ రావడంతో..
'ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్ జరుగుతుంది. కానీ రేపు రాజస్థాన్-చెన్నై మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉంది. సీఎస్‌కే కోచ్ బాలాజీకి కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు.'అని ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి ఏఎన్‌ఐకి తెలిపారు. ఐపీఎల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం.. కరోనా పాజిటివ్‌తో క్లోజ్‌గా కాంటాక్ట్ అయిన వ్యక్తులు ఆరు రోజుల పాటు ఐసోలేషన్ ఉండి.. 1,3, 6వ రోజుల్లో మూడు నెగెటివ్ టెస్టులు వస్తేనే తిరిగి గ్రౌండ్‌లోకి అనుమతిస్తారు. కోల్‌కతా తన తదుపరి మ్యాచ్ ఈ నెల 8న ఢిల్లీతోనే ఆడనుంది.

ముంబైకి షిఫ్ట్..
కోల్‌కతా, బెంగళూరుకు వెళ్తే మరింత ప్రమాదం ట్రావెలింగ్ వల్లే ఐపీఎల్‌లో కరోనా టెన్షన్ మొదలైందని పలు ఫ్రాంచైజీలు అంటున్నాయి. లీగ్ ఆరంభానికి ముందు వేర్వేరు దేశాలు, నగరాల నుంచి ప్లేయర్లు తమ టీమ్‌లో జాయిన్ అయ్యే క్రమంలో వైరస్ బారిన పడ్డారు. కానీ, చెన్నై, ముంబైలో ఆడుతున్నప్పుడు ఒక్క కేసు కూడా రాలేదు.
అయితే, తొలి దశ ముగిసి ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, ఢిల్లీ చేరుకునేందుకు ట్రావెల్ చేయడం వల్లే పరిస్థితి మారిందన్న అభిప్రాయాలున్నాయి. తదుపరి లీగ్‌ను కోల్‌కతా, బెంగళూరుకు షిఫ్ట్ చేస్తే మరింత ప్రమాదం కొనితెచ్చుకున్నట్టే అని ఫ్రాంఛైజీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్‌లన్నిటీ ముంబైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

అనుమతిరాగానే..
'మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతిరాగానే మ్యాచ్‌లను అక్కడికి తరలించాలని భావిస్తున్నాం. అనుమతి రావడానికి మరో రెండు రోజుల సమయం పట్టనుంది'అని సదరు అధికారి చెప్పుకొచ్చాడు. దేశంలోని కొవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో మహారాష్ట్ర ఒకటి. అయిప్పటికీ.. ముంబైలో ప్రారంభ మ్యాచ్‌లు సజావుగా సాగాయి. ప్రపంచ స్థాయి స్టేడియాలు మూడు ఉన్నాయి. దీంతో మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించడానికి ముంబైనే అనుకూలమైన ప్రాంతామని బీసీసీఐ భావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications