CSK vs RR బిగ్ ఫైట్.. ధోనీ X శాంసన్.. అనుభవానికి దూకుడుకు మధ్య పోరు గెలిచేదెవరో? తుది జట్లు ఇవే!

ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. వాంఖడే స్టేడియంలో నేడు(సోమవారం) జరిగే లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిన చెన్నై, రాజస్థాన్.. తమ సెకండ్ మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలందుకున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఏకపక్ష విజయాన్నందుకుంటే.. ఢిల్లీతో జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ ఉత్కంఠ విజయం సాధించింది. అదే జోరులో ఈ మ్యాచ్‌ను కూడా ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. పేపర్‌పై ఇరు జట్లు బలంగా ఉండటంతో మరోసారి హోరా హోరీ పోరు తప్పదు. అనుభవానికి దూకుడుగా మధ్య జరుగుతున్న ఈ పోరులో గెలిచే జట్టు ఏదో చూడాలి!

దీపక్ చాహర్‌పైనే..
పంజాబ్‌తో జరిగిన పోరులో నాలుగు వికెట్లతో అదరగొట్టిన పేసర్ దీపక్ చాహర్‌పైనే చెన్నై మరోసారి భారీ ఆశలు పెట్టుకుంది. అయితే గత మ్యాచ్‌లో సీఎస్‌కే బౌలింగ్ యూనిట్ సూపర్ సక్సెస్ కావడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్ మరింత బాధ్యత తీసుకోవాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. సౌతాఫ్రికా పేసర్ లుంగిఎంగిడి జట్టుతో కలవడంతో సీఎస్‌కే బౌలింగ్ లైనప్ పదును పెరిగింది. బ్యాటింగ్‌లోనూ చెన్నైకి పెద్దగా సమస్యల్లేవు. డుప్లెసిస్, మొయిన్ అలీ టచ్‌లో ఉండగా.. రాయుడు, రుతురాజ్ మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంది. సురేశ్ రైనా మరోసారి కీలకం కానుండగా.. ధోనీ ఫినిషింగ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎందురు చూస్తున్నారు. సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో డకౌటైన ధోనీకి పంజాబ్‌తో మ్యాచ్‌లో చాన్స్ రాలేదు. ఇక ఈ మ్యాచ్‌కు చెన్నై ఎలాంటి మార్పు లేకుండా విన్నింగ్ టీమ్‌నే కొనసాగించే అవకాశం ఉంది. రుతురాజ్‌ను పక్కన పెట్టాలని భావిస్తే ఊతప్పకు చోటు దక్కవచ్చు.

సంజూ శాంసన్ చెలరేగితే..
మరోపక్క పంజాబ్ చేతిలో దురదృష్ణవశాత్తూ ఓడిన రాజస్థా రాయల్స్.. ఢిల్లీపై గెలిచి ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచుకుంది. గత మ్యాచ్‌లో విఫలమైన రాజస్థాన్ టాపార్డర్ నిలకడ చూపాల్సి ఉంది. ఫస్ట్ మ్యాచ్‌లో వీరిచిత సెంచరీతో ఆకట్టుకున్న సంజూశాంసన్ సెకండ్ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అతను తన జోరు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఓపెనర్లు జోస్ బట్లర్, మనన్ ఓహ్రా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాలి. స్టోక్స్ గైర్హాజరీ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లు రాణించడం చాలా ముఖ్యం. అయితే డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్‌తో ఆ జట్టు మిడిలార్డర్ బలంగా ఉంది. వీరికి తోడుగా రియాన్ పరాగ్ కూడా మెరుపులు మెరిపిస్తే బ్యాటింగ్‌లో రాజస్థాన్‌కు తిరుగుండదు. యంగ్ పేసర్ చేతన్ సకారియా, సీనియర్ జైదేవ్ ఉనాద్కట్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. వీరికి తోడుగా ముస్తాఫిజుర్ రెహమాన్, క్రిస్ మోరిస్ కీలక సమయంలో అండగా నిలుస్తున్నారు. రాహుల్ తెవాటియా అటు బ్యాటింగ్, బౌలింగ్‌లో తన మార్క్ పెర్ఫామెన్స్ చూపించాల్సి ఉంది. రాజస్థాన్ కూడా అదే జట్టును కొనసాగించే అవకాశం ఉంది.

ముఖా ముఖి..
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 23 సార్లు తలపడగా.. 14 విజయాలతో చెన్నైసూపర్ కింగ్సే పైచేయి సాధించింది. రాజస్థాన్ 9 విజయాలకే పరిమితమైంది. అయితే 2015 తర్వాత ఇరు జట్లు హోరాహోరిగా తలపడ్డాయి. చెరో నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచాయి. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ విజయం సాధించింది. పిచ్ ఇప్పటి వరకు బౌలింగ్ అనుకూలించగా.. ఆదివారం పంజాబ్-ఢిల్లీ మధ్య జరిగిన పోరులో పరుగుల వరద పారింది. ఈ లెక్కన టాస్ గెలిచిన జట్టు చేజింగ్‌కు మొగ్గు చూపవచ్చు.

తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్/రాబిన్ ఊతప్ప, ఫాఫ్ డూప్లెసిస్, మొయిన్ అలీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, సామ్ కరన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), డ్వేన్ బ్రావో/లుంగి ఎంగిడి, శార్దూల్ ఠాకూర్
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, మనన్ వోహ్రా, సంజూ శాంసన్(కీపర్/కెప్టెన్), శివం దూబే, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరీస్, జయదేవ్ ఉనాద్కత్/శ్రేయస్ గోపాల్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్

చెన్నై vs రాజస్థాన్ డ్రీమ్ 11 ప్రిడిక్షన్
సంజూ శాంసన్(వైస్ కెప్టెన్), ఫాఫ్ డూప్లెసిస్(కెప్టెన్), జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్, సురేశ్ రైనా, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ మోరీస్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, చేతన్ సకారియా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications