
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా వాంఖడే మైదానం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వేడి, వికెట్ నెమ్మదిగా ఉంటుందనే ఆలోచనతోనే తొలుత బ్యాటింగ్ చేస్తున్నట్లు సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయన్న మహీ.. మొయిన్ అలీ ఫిట్‌గా లేడని అతని స్థానంలో బ్రావో వచ్చాడన్నాడు. అలాగే పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో లుంగి ఎంగిడి ప్లేస్‌లో ఇమ్రాన్ తాహిర్‌ను తీసుకున్నామన్నాడు.
ఇక తొలుత బౌలింగ్ చేయడం సంతోషంగానే ఉందని ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయని, కేన్ రిచర్డ్సన్, షాబాజ్ నదీమ్ స్థానంలో డానియల్ క్రిస్టియన్, నవదీప్‌సైనీ వచ్చారన్నాడు. కట్టర్ బౌలర్స్ ఇద్దరు ఉండాలనే ఆలోచనతోనే సైనీ తీసుకున్నామన్నాడు.
నిలకడైన ఆటతీరుతో నాలుగింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచి జోరుమీదున్న బెంగళూరు ఐదో విజయంపై కన్నేసింది. ఇక ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్.. తర్వాత వరుసగా మూడు విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 27 సార్లు తలపడగా.. 17 విజయాలతో చెన్నై జట్టే పైచేయి సాధించింది. ఆర్‌సీబీ 9 మ్యాచ్‌లు గెలవగా.. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. గత సీజన్‌లో మాత్రం చెరొక విజయాన్నందుకున్నాయి.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: ఫాఫ్ డూ ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), సామకరన్, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహీర్, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, వాషింగ్టన్ సుందర్, కైల్ జెమీసన్, హర్షల్ పటేల్, డానియల్ క్రిస్టియన్ , యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ