
ముంబై-హైదరాబాద్ సూపర్ హిట్..
తెలుగులో స్టార్ స్పోర్ట్స్ తెలుగుతో పాటు స్టార్ మా గోల్డ్ చానెల్‌లో మ్యాచ్‌ల లైవ్ వచ్చింది. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రాగా.. స్టార్ మాగోల్డ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. అయితే ఏకకాలంలో వచ్చిన ఈ రెండు మ్యాచ్‌లను జనాలను ఫాలో అయ్యారు. టీవీ రిమోట్‌తో కుస్తీపడ్డారు. ఇక హాట్ స్టార్‌లో సైతం ఇలానే జరిగింది. కానీ ఈ రెండు మ్యాచ్‌ల్లో హిట్టయ్యింది మాత్రం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచే. ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీ మ్యాచ్‌ను జనాలు లైట్ తీసుకున్నారు. కేవలం యాడ్ బ్రేక్ టైమ్‌లో స్కోర్ బోర్డును ఫాలో అయ్యారు. హాట్ స్టార్ వ్యూయర్‌షిప్ లెక్కలు చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది.

హై స్కోరింగ్ గేమ్ కావడం..
హాట్ స్టార్‌లో ముంబై-హైదరాబాద్ మ్యాచ్‌ను 36 లక్షల మంది చూడగా.. బెంగళూరు-ఢిల్లీ మ్యాచ్‌ను 11 లక్షల మంది మాత్రమే చూశారు. మ్యాచ్ చివర్లో బెంగళూరు-ఢిల్లీ మ్యాచ్‌కు వ్యూయర్‌షిప్ పెరిగినా అది ముంబై-హైదరాబాద్ మ్యాచ్‌ను బీట్ చేయలేకపోయింది. ఏ దశలోనూ ఆర్‌సీబీ-ఢిల్లీ మ్యాచ్‌ను చూసే వారి సంఖ్య 36 లక్షలు ధాటలేదు. కానీ ముంబై-హైదరాబాద్ మ్యాచ్‌కు మాత్రం 40 లక్షల వరకు వెళ్లింది. టీవీ రేటింగ్స్‌లోను ఇవే రికార్డులు నమోదయ్యాయి. హై స్కోరింగ్ మ్యాచ్ కావడం.. ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ధనాధన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగడం, సిక్సర్ల వర్షం కురిపించడం అభిమానులను అటువైపు మళ్లించింది.

కోహ్లీ వికెట్ పడటంతో..
పైగా ప్లే ఆఫ్స్ రేసుకు ముంబై ఇండియన్స్‌కు చివరి అవకాశం ఉండటం, 235 పరుగుల భారీ స్కోర్ చేయడంతో 171 పరుగుల తేడాతో గెలుస్తుందా? అనే ఆతృత ముంబై-హైదరాబాద్ మ్యాచ్ హిట్టయ్యేలా చేశాయి. మరోవైపు ఆర్‌సీబీ-ఢిల్లీ మ్యాచ్ చప్పగా సాగడం.. పెద్దగా మెరుపులు లేకపోవడంతో ప్రేక్షకులు స్కోర్ బోర్డు చూడటం వరకే పరిమితయ్యారు. ఇక ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో పడిక్కల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ త్వరగా ఔటవ్వడంతో.. ఆ టీమ్ ఫ్యాన్స్ సైతం ఆశలు వదులుకొని మ్యాచ్‌ను లైట్ తీసుకున్నారు. చివర్లో మ్యాక్సీ, కేఎస్ భరత్ అద్భుతంగా ఆడటంతో ప్రేక్షకు ఆసక్తికనబర్చారు.

అందుకే ఏకకాలంలో రెండు మ్యాచ్‌లు..
కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తు దృష్ట్యా బీసీసీఐ ఈ ఆలోచన చేసింది. ఒకే కాలంలో రెండు మ్యాచ్‌లు నిర్వహిస్తే ప్రేక్షకాదరణ ఎలా ఉంటుందనేది తెలుసుకోవడానినే ఈ పనిచేసింది. కఠిన బయో బబుల్ నేపథ్యంలో మ్యాచ్‌లు నిర్వహించడం కష్టంగా మారింది. ఇప్పటికే ఒకే సమయంలో రెండు జట్లను ఆడించి మంచి ఫలితాన్ని రాబట్టిన బీసీసీఐ.. ఇప్పుడు ఏకకాలంలో మ్యాచ్‌లు నిర్వహించి సక్సెస్ అయింది. భవిష్యత్తులో టీమిండియా రెండు జట్లుగా విడిపోయి ఒకే సమయంలో రెండు పర్యటనలకు వెళ్లి ఏకకాలంలో ఆడే అవకాశం లేకపోలేదు. వచ్చే సీజన్ ఐపీఎల్‌కు కొత్తగా రెండు జట్లు రానుండటంతో మ్యాచ్‌ల సంఖ్య పెరగనుంది. దాంతో బీసీసీఐ.. ఒకే సమయంలో రెండు మ్యాచ్‌లు ఉండేలా షెడ్యూల్ చేయనుంది.


Click it and Unblock the Notifications
