న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 సెకండ్ ఫేజ్ ఆఫర్స్‌పై ఇంకా చర్చించలేదు: బీసీసీఐ

IPL 2021: BCCI treasurer Arun Dhumal says ‘Too early to discuss English counties

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సెకండ్ ఫేజ్ నిర్వహణ కోసం వచ్చిన ఆఫర్లపై ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్రెజరర్ అరుణ్ సింగ్ ధూమల్ వెల్లడించాడు. రాయిటర్స్‌తో మాట్లాడిన ఆయన పలు దేశాలు ఇచ్చిన ఆఫర్లపై స్పందించాడు.

'అన్ని ఆప్షన్స్‌ను మేం పరిశీలిస్తాం. కానీ ఇప్పుడు కాదు. సరైన టైమ్‌లో దానిపై సరైన నిర్ణయం తీసుకుంటాం. మిగతా మ్యాచ్‌లను కంప్లీట్ చేసేందుకు ఎలాంటి చర్యలు అవసరమో చూస్తున్నాం. ఇంగ్లండ్ కౌంటీలు ఇచ్చిన ఆఫర్స్‌పై కూడా ఎలాంటి చర్చ జరగలేదు. ఇప్పుడు చర్చించడం తొందరపాటు అవుతోంది. ఏదేమైనా ఐపీఎల్‌కు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తెలిసిపోయింది.

ప్రతీ ఒక్కరు మ్యాచ్‌లు కావాలని కోరుకుంటున్నారు. ఇండియా అవతల కూడా ఐపీఎల్‌కు భారీ ఫాలోయింగ్ వచ్చింది'అని ధూమల్ పేర్కొన్నాడు. ప్రస్తుతానికైతే తమ దృష్టంతా టీ20 వరల్డ్ కప్‌పైనే ఉందన్నారు. మెగా ఈవెంట్ ప్రిపరేషన్స్‌ను ఫైనలైజ్ చేయడమే తమ టార్గెట్ అని చెప్పారు.

మెరిలీన్ క్రికెట్ బోర్డు, వార్‌విక్‌షైర్, సర్రే వంటి ఇంగ్లండ్ కౌంటీ టీమ్స్ ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ నిర్వహించేందుకు ముందుకొచ్చాయి. శ్రీలంక క్రికెట్ బోర్డు సైతం తమ దేశంలో నిర్వహించేందుకు బీసీసీఐకి ఆఫరిచ్చింది. ఇక కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. బబుల్‌లోకి చొచ్చుకొచ్చిన వైరస్ వేగంగా ఆటగాళ్లకు సోకడంతో బీసీసీఐ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసింది.

Story first published: Saturday, May 8, 2021, 14:23 [IST]
Other articles published on May 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X