ముంబైలో కరోనా కలకలం.. హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు!

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ప్రారంభానికి ముందు దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని పరిస్థితి లీగ్ నిర్వహణపై సందేహాలను రేకెత్తిస్తోంది. ఒక్క రోజులోనే అక్కడ 40 వేల కొత్త కేసులు నమోదవ్వడం, పరిస్థితి అదుపులోకి రాకుంటే.. లాక్‌డౌన్ పెడ్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించడం.. ఐపీఎల్ నిర్వాహకుల్లో ఆందోళన రెకెత్తిస్తోంది. కరోనా నేపథ్యంలో ఈసారి లీగ్‌ను చెన్నై, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా ఆరు నగరాల్లోనే నిర్వహించనున్న విషయం తెలిసిందే.

బ్యాకప్‌గా హైదరాబాద్..
తాజాగా ముంబైలోని వాంఖడే మైదాన సిబ్బందిలో 10 మందితో పాటు ఆరుగురు ఈవెంట్ మేనేజర్లు కరోనా సోకింది. దాంతో అక్కడి మ్యాచ్‌లు జరుగుతాయా లేదా? అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశంలోని కరోనా పరిస్థితిని బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులు నిశితంగా పరిశీలిస్తున్నారని, షెడ్యూల్ ప్రకారం మెగా లీగ్‌ను నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నారని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఒకవేళ ఏదైనా వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేకుంటే.. బ్యాకప్‌గా పెట్టుకున్న హైదరాబాద్, ఇండోర్ మైదానంలో నిర్వహిస్తామన్నారు.

లాక్‌డౌన్ పెట్టినా..
'ఒకవేళ ముంబైలో లాక్‌డౌన్ పెట్టినా సరే, జట్లు బయో బబుల్‌లో ఉన్నాయి. ప్రేక్షకుల్లేకుండానే మ్యాచ్‌లు జరుగుతాయి. కాబట్టి ముంబైలో మ్యాచ్‌లపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. షెడ్యూల్ ప్రకారం ఇక్కడ చెన్నై-ఢిల్లీ జట్ల మధ్య ఏప్రిల్ 10న తొలి మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ పరిస్థితి చేయిదాటితే హైదరాబాద్, ఇండోర్ ప్రత్యామ్నయ వేదికలుగా ఉన్నాయి" అని సదరు బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలని, అందుకు ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ, సహకారాలను అందిస్తామని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే

ముంబైలో కరోనా కలకలం..
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 10 నుంచి 25 వరకు పది మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏప్రిల్ 10న తొలి పోరులో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. మహారాష్ట్రలో రోజురోజుకీ కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 47 వేల 827 కొత్త కేసులు వెలుగుచూశాయి. 202 మరణాలు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 8,832 కేసులు వచ్చాయి. 8,500 పైగా కేసులు రావడం ఇది వరుసగా రెండో రోజు.

ఆటగాళ్లు సైతం..
ఆటగాళ్లు ఎంత బయోబబుల్‌లో ఉన్న ఒక్కొక్కరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కేకేఆర్ ప్లేయర్ నితీష్ రాణా, ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కరోనా బారిన పడగా.. చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌లో కూడా ఒకరికి వైరస్ సోకింది. ఈ క్రమంలోవాంఖడే స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై బీసీసీఐ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి వారం రోజుల సమయం కూడా అందుబాటులో లేని తరుణంలో ముంబైలోని జరగాల్సిన మ్యాచ్‌లను హైదరాబాద్‌కు మార్చడం కష్టతరమే కావచ్చు. కానీ అసాధ్యమేమీ కాదు. మరి దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications