IPL 2021 Auction: తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి చాన్స్!

చెన్నై: ఐపీఎల్ 2021 మినీ వేలంలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లకు మొండి చెయ్యే ఎదురైంది. టీమిండియా ప్లేయర్ హనుమ విహారితో సహా 14 మంది యువ ఆటగాళ్లు వేలం రేసులో ఉండగా.. కేవలం నలుగురికి అవకాశం దక్కింది. అందులో ఇద్దరు ఆంధ్రకు చెందిన వారు కాగా.. మరొ ఇద్దరు హైదరాబాద్ ప్లేయర్లు. వికెట్ కీపర్ కేఎస్ భరత్, పేసర్ హరిశంకర్ రెడ్డి, భగత్ వర్మ, యుధ్ వీర్ వారి కనీస ధర రూ.20 లక్షలకు అమ్ముడుపోయారు. కేఎస్ భరత్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తీసుకోగా.. హరిశంకర్ రెడ్డి, భగత్ వర్మ చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. యుధ్‌వీర్‌ను ముంబై తీసుకుంది.

విహారికి మళ్లీ నిరాశే..
రూ. కోటి బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వెళ్లిన టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారికి మళ్లీ నిరాశే ఎదురైంది. అతన్ని తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. మరోవైపు అతని సహచర టెస్ట్ క్రికెటర్ చతేశ్వర్ పుజారాను మాత్రం రూ. 50 లక్షల ప్రైజ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. విహారి కూడా తన బేస్ ప్రైజ్ తగ్గించుకొని ఉంటే ఫలితం ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2013, 2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన విహారి.. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. 24 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన విహారి 284 రన్స్ చేశాడు.

సందీప్‌కు నిరాశే..
గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎంపికైనా ఒక్క మ్యాచ్‌లోనూ ఆడని ఆల్‌రౌండర్ బావనక సందీప్‌కు ఈ ఏడాది నిరాశే ఎదురైంది. అతనిపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. అతనితో పాటు హైదరాబాద్ ఆటగాళ్లు మిలింద్, అజయ్ దేవ్‌గౌడ్, టి రవితేజ, తనయ్, తిలక్ వర్మ అమ్ముడు పోలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఫర్వాలేదనిపించిన తిలక్ వర్మ, రవితేజలకు అవకాశం లభిస్తుందని భావించినా.. ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు.

పృథ్వీ రాజ్ కూడా..
గత సీజన్‌లో హైదరాబాద్ జట్టులో అనూహ్యంగా అవకాశం దక్కించుకున్న పృథ్వీరాజ్‌కు తాజా వేలంలో కూడా నిరాశే ఎదురైంది. భవీ గాయంతో ఆరెంజ్ ఆర్మీలోకి వచ్చిన పృథ్వీ రాజ్ మళ్లీ అవకాశాన్ని అందుకోలేకపోయాడు. పేసర్ సీహెచ్ స్టీఫెన్ ఆల్‌రౌండర్ షోయబ్‌లకు కూడా నిరాశే ఎదురైంది. గత కొన్ని సీజన్లుగా తెలుగు రాష్ట్రాల ఆటగాళ్ల ప్రాతినిధ్యం తగ్గిన నేపథ్యంలో ఈసారైన ఎక్కువ మందికి అవకాశం దక్కాలని ఇరు రాష్ట్రాల అభిమానులు కోరుకున్నారు. కానీ నలుగురికి అవకాశం దక్కడంతో అంబటి రాయుడు, మహ్మద్ సిరాజ్ తో ఐపీఎల్‌లో ఆడే తెలుగు క్రికెటర్ల సంఖ్య ఆరుకు చేరింది.

ఆల్‌రౌండర్లకే డిమాండ్..
ఐపీఎల్ 2021 మినీ వేలంలో ఫారిన్ ప్లేయర్లు దుమ్ములేపారు. ముఖ్యంగా ఆల్‌రౌండర్లు, ఫాస్ట్ బౌలర్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్ ఏకంగా రూ.16.25 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయి ఐపీఎల్ వేలంలోనే ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతన్ని రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఇక గ్లేన్ మ్యాక్స్‌వెల్ రూ.14.25 కోట్లు, షకీబ్ అల్ హసన్ 3.20 కోట్లు, మోయిన్ అలీ రూ. 7 కోట్లు, కృష్ణ ప్ప గౌతమ్ రూ.9.25 కోట్లు, కైల్ జేమీసన్ రూ. 15 కోట్లు భారీ ధర పలికారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications