ఆ ఐపీఎల్ వేలం నా జీవితాన్నే మార్చేసింది: గ్లేన్ మ్యాక్స్‌వెల్

సిడ్నీ: 2013 ఐపీఎల్ వేలం తన జీవితాన్ని మార్చేసిందని ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ అన్నాడు. అంత మొత్తం ధర పలకడాన్ని నమ్మలేకపోయానని ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ చెప్పుకొచ్చాడు. 2012లో యువ ఆటగాడిగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మ్యాక్స్‌వెల్ 2014లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున బరిలోకి దిగి అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
దాంతో ఆ జట్టు.. లీగ్ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరింది. ఇక నాటి నుంచి అతని దశ తిరిగిపోయింది. అయితే, 2013లో ముంబై ఇండియన్స్ తనని 1 మిలియన్ డాలర్ల ధరకు కొనుగోలు చేసింది. ఆ ధరను తన జీవితంలో మర్చిపోలేనని తాజాగా ఈఎస్‌పీన్ క్రిక్‌ఇన్ ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాక్స్‌వెల్ చెప్పుకొచ్చాడు.

గోల్డెన్ డక్ అయ్యా..
'2013లో ఐపీఎల్ వేలం జరుగుతున్న రోజు నేను వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆడుతున్నా. ఆ వేలం గురించి నాకసలు గుర్తేలేదు. అయితే, ఆ మ్యాచ్‌లో నేను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌటై నిరాశతో వెనుదిరిగా. డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నాక అక్కడున్న కొందరు ఎగతాళిగా నవ్వుకుంటున్నారు. ఏం జరుగుతుందో అర్థంకాక కోపంతో అక్కడే కూర్చున్నా. కాసేపటికి సీనియర్ ఆటగాళ్లు మికీ ఆర్థర్, మైఖేల్ క్లార్క్ వచ్చి నన్ను వేరే గదికి తీసుకెళ్లారు. ఆ రోజు నా ప్రదర్శనపై చీవాట్లు పెడతారని అనుకున్నా. కానీ, అప్పుడు ఐపీఎల్ వేలం జరుగుతోందని చెప్పారు.

మాటలు రాలేదు..
సరే అని పక్కకు తప్పుకున్నా. తర్వాత నేను రూ.5.3 కోట్లు ధర పలికానని చెప్పారు. ఎలా స్పందించాలో అర్థంకాలేదు. మళ్లీ వెళ్లి డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్నా. అప్పటికీ వేరేవాళ్లు నవ్వుతూనే ఉన్నారు. అది నా జీవితంలో సంతోషకరమైన రోజు. ఆ మ్యాచ్ చూసేందుకు నా కుటుంబం మొత్తం వచ్చింది. మ్యాచ్ పూర్తయ్యాక అందరితో కలిసి సంతోషంగా గడిపాను. ఆ వేలంలో వచ్చిన నగదు నా జీవితాన్ని మార్చేసింది.

గత సీజన్‌లో ఒక్క సిక్స్ కొట్టలే..
ఇక మాక్స్‌వెల్ గతేడాది ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున ఆడిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో ఆ ఫ్రాంఛైజీ అతన్ని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అంత ధర పలికినా.. యూఏఈ వేదికగా జరిగిన మెగా ఈవెంట్‌లో మ్యాక్స్‌వెల్ దారుణంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌లాడి కేవలం 108 పరుగులే చేశాడు. అందులో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గతనెల పంజాబ్ అతడిని వదులుకొంది. ఇప్పుడీ స్టార్ ఆటగాడిని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తసుకునే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications