Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'రికార్డుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.. మలింగ రికార్డు బ్రేక్‌ చేసినంత మాత్రాన నాకు వచ్చేది ఏం లేదు'

IPL 2021: Amit Mishra says I never focused on breaking Lasith Malingas record

చెన్నై: రికార్డుల గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా తెలిపాడు. ఐపీఎల్ టోర్నీలో లసిత్‌ మలింగ రికార్డు బ్రేక్‌ చేయబోతున్నానే విషయం తనకు తెలియదని, రాబోయే మ్యాచ్‌ల్లో దానిని బ్రేక్‌ చేసినంత మాత్రానా వచ్చేది ఏం లేదన్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్‌రౌండర్‌ కీరన్ పొలార్డ్ వికెట్లు తీయడం తనకు చాలా ప్రత్యేకం అని అమిత్‌ మిశ్రా చెప్పాడు. మంగళవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో‌ మిశ్రా 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

7 వికెట్ల దూరంలో

7 వికెట్ల దూరంలో

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో శ్రీలంక పేసర్ లసిత్ మలింగ తొలి స్థానంలో ఉండగా.. అమిత్‌ మిశ్రా రెండో స్థానంలో ఉన్నాడు. మలింగ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 122 మ్యాచ్‌లాడి 170 వికెట్లు తీయగా.. మిశ్రా 152 మ్యాచ్‌లాడి 164 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలవడానికి మిశ్రా కేవలం 7 వికెట్ల దూరంలో ఉ‍న్నాడు. ఈ సీజన్‌లో ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో మిశ్రా ఈ రికార్డును అతి త్వరలోనే బ్రేక్‌ చేసే అవకాశం ఉంది. అయితే తాను రికార్డులు సాధించడం కంటే.. జట్టును గెలిపించడంపైనే దృష్టి పెట్టినట్లు అమిత్ మిశ్రా తెలిపాడు.

రికార్డుల గురించి ఆలోచించలేదు

రికార్డుల గురించి ఆలోచించలేదు

ముంబై ఇండియన్స్‌ మ్యాచ్ అనంతరం పృథ్వీ షా చేసిన ఓ ఇంటర్వ్యూలో అమిత్ మిశ్రా పాల్గొన్నాడు. 'నేను ఎప్పుడు రికార్డుల గురించి ఆలోచించలేదు. లసిత్‌ మలింగ రికార్డు బ్రేక్‌ చేయబోతున్నానే విషయం నాకు తెలియదు. రాబోయే మ్యాచ్‌ల్లో దానిని బ్రేక్‌ చేసినంత మాత్రాన నాకు వచ్చేది ఏం లేదు. కేవలం ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ అనే పేరు తప్ప. ప్రస్తుతం నా దృష్టంతా వికెట్లు తీసి ఢిల్లీ జట్టును గెలిపించడమే. మొదటగా ప్లే ఆఫ్, ఆపై టైటిల్ గెలవాలి' అని మిశ్రా తెలిపాడు. మిశ్రా భారత్ తరఫున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడాడు.

రోహిత్‌ అలా ఔట్ అవుతున్నాడు

రోహిత్‌ అలా ఔట్ అవుతున్నాడు

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌ శర్మను ఐపీఎల్‌లో 7సార్లు ఔట్‌ చేయడంపై అమిత్ మిశ్రా స్పందించాడు. 'రోహిత్‌కు బౌలింగ్‌ వేసేటప్పుడు అతను హిట్టింగ్‌ చేయకుండా వైవిధ్యమైన బంతులు వేస్తూ అతని ఏకాగ్రతను దెబ్బతీస్తాను. అందులోనూ నేను వేసే వాటిలో ఎక్కువగా ఫ్లైట్‌ డెలివరీలు ఉండడంతో రోహిత్‌ అవుటవుతున్నాడు. అయితే రోహిత్‌ నా బౌలింగ్‌లో ఏడు సార్లు ఔటయ్యాడన్న విషయం నాకు తెలియదు. అయితే ఈ మ్యాచులో రోహిత్, పొలార్డ్ వికెట్ తీయడం నాకు ప్రత్యేకం. నాలుగు వికెట్లు తీసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ప్రదర్శనను వచ్చే మ్యాచుల్లో కూడా కొనసాగిస్తా' అని మిశ్రా ధీమా వ్యక్తం చేశాడు.

మిశ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్:

మిశ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్:

మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఢిల్లీ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా (4/24) తిప్పేశాడు. లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి గెలిచింది. శిఖర్‌ ధావన్‌ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్‌), స్టీవ్ స్మిత్‌ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన మిశ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది.

PBKS vs SRH: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్‌‌కు గాయం! పంజాబ్ మ్యాచ్‌లో ఆడేది అనుమానమే?

Story first published: Wednesday, April 21, 2021, 19:01 [IST]
Other articles published on Apr 21, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+