సమన్వయ లోపం..
దీపక్ చాహర్ వేసిన గుడ్ లెంగ్త్ బాల్‌ను శుభ్‌మన్ మిడ్ వికెట్ మీదుగా ఆడి క్విక్ సింగిల్స్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న్ రాయుడు బంతిని అందుకోవడం గమనించిన నాన్ స్ట్రైకర్ వెంకటేశ్ అయ్యర్ పరుగు వద్దని వారించాడు. కానీ అప్పటికే హాఫ్ పిచ్ ధాటిన శుభ్‌మన్ వెనక్కివెళ్లలోపే రాయుడు తన సూపర్‌త్రోతో వికెట్లను డైరెక్ట్ హిట్ చేశాడు. ఇక్కడ వెంకటేశ్ అయ్యర్‌దే తప్పు.
అతను ముందుగా పరుగు కోసం మూవ్‌మెంట్ ఇచ్చి మధ్యలో ఆగిపోయాడు. దాంతో శుభ్‌మన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఇక రాయుడుని సహచర ఆటగాళ్లంతా ప్రశంసించారు. అతను కూడా అలా ఎలా తాకిందనే ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం గమనార్హం.
రాయుడో రాయుడు..
ఇక రాయుడు సూపర్ త్రోపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ ఫీల్డింగ్ అంటూ కొనియాడుతున్నారు. ట్విటర్ వేదికగా రాయుడిని కొనియాడుతూ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. రాయుడు 4డీ ప్లేయరని, 3డీ ప్లేయర్ విజయ్ శంకర్ కంటే మెరుగైన ఆటగాడంటూ సెటైర్లు పేల్చుతున్నారు. అనవసర రాజకీయాలతో రాయుడిని భారత జట్టుకు దూరం చేశారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెస్కే ప్రసాద్ ఈ ఫీల్డింగ్ చూసాడా? అని ప్రశ్నిస్తున్నారు.
3D ప్లేయరంటూ..
2019 వన్డే ప్రపంచకప్ జట్టులో అంబటి రాయుడును కాదని త్రీడీ ప్లేయర్ అంటూ విజయ్ శంకర్‌కు అవకాశమిచ్చారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేయగలడని, రాయుడి కంటే మెరుగైన ఆటగాడని అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. ఆ వ్యాఖ్యల తర్వాత రాయుడు తీడ్రీ గ్లాస్‌లో ఆటను చూస్తానని ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. 2019 ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో తీవ్ర మనోవేదనకు లోనైన అంబటి రాయుడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇక రాయుడు అద్భుత ప్రదర్శన కనబర్చినప్పుడల్లా ఈ త్రీడీ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.

రాహుల్ త్రిపాఠి జోరు..
ఇక శుభ్‌మన్ గిల్ ఔటైన తర్వాత రాహుల్ త్రిపాఠి క్రీజులోకి రాగా.. మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యార్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు.క్రీజులో పాతుకుపోతున్న ఈ జోడిని శార్దూల్ ఠాకూర్ తన ఫస్ట్ ఓవర్‌లోనే బోల్తా కొట్టించాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి కోల్‌కతా 2 వికెట్లకు 50 పరుగులు చేసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. బౌండరీ లైన్ వద్ద ఫాఫ్ డుప్లెసిస్ పట్టిన సూపర్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దాంతో 10 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజులో త్రిపాఠి(38 బ్యాటింగ్)తో పాటు నితీశ్ రానా(1 బ్యాటింగ్) ఉన్నారు.


Click it and Unblock the Notifications
