
కోహ్లీ vs బుమ్రా
శుక్రవారం ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ... 'ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్ల మధ్య సమరమే ఈ మ్యాచ్‌లో కీలకం. ఎందుకంటే విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ప్రత్యర్థులుగా ఆడుతున్నారు. ఇద్దరూ అత్యుత్తమ క్రికెటర్లే. ప్రస్తుతం కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. బుమ్రా పెళ్లి విరామం తీసుకొని వస్తున్నాడు. ఐపీఎల్ 2021లో కోహ్లీ ఓపెనింగ్ చేస్తున్నాడు. అలాగే కొత్త బంతితో బుమ్రా.. కోహ్లీ ముందు సిద్ధంగా ఉంటాడు. వీరి పోటీ ఆసక్తికరం. గతంలో విరాట్‌పై బుమ్రా పై చేయిసాధించాడు' అని అన్నాడు.

వారి పోరు కోసం ఎదురు చూస్తున్నా
'విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు రాగానే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని కచ్చితంగా బుమ్రాకు ఇస్తాడు. వెంటనే అతడు బౌన్సర్లు విసురుతాడు. ఎందుకంటే.. రెండు మూడుసార్లు పుల్‌షాట్లు ఆడబోయి కోహ్లీ ఔటయ్యాడు. సాధారణంగా అతడు అలా ఔట్ కాడు. తన అహాన్ని పక్కన పెడతాడు. బుమ్రాపై మాత్రం పుల్‌షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. చెత్త షాటుకు ఔటయ్యాడు. అందుకే వీరిద్దరి పోరు కోసం నేను ఎదురు చూస్తున్నా' అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.

ముంబైదే పైచేయి
ముంబైపై బెంగళూరు రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. చిదంబరం స్టేడియంలో గత ఐదు మ్యాచ్‌ల రికార్డు విరాట్ కోహ్లీకి అస్సలు మింగుడుపడనిదే. ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో ఈ రెండు టీమ్స్ 29 మ్యాచ్‌లు ఆడగా.. ముంబై 19, బెంగళూరు 10 గెలిచాయి. ఇక చిదంబరం స్టేడియంలో ఆడిన చివరి ఐదు మ్యాచ్‌లనూ ముంబై ఇండియన్స్ గెలవగా.. ఆర్సీబీ అన్నింట్లోనూ ఓడిపోయింది. అయితే కోహ్లీసేనను తక్కువ చేయలేం. ఈసారి వేలంలో స్టార్ ఆటగాళ్లను కొనుగోలుచేసింది. అందులో ముఖ్యమైన ఆటగాడు మ్యాక్సీ.

తుది జట్లు (అంచనా)
ముంబై: రోహిత్ శర్మ, క్రిస్ లిన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, హార్డిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ఆడమ్ మిల్నె/ మార్కో జాన్సెన్, రాహుల్ చహర్/ పియూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.
బెంగళూరు: దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అజారుద్దీన్, డేనియల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, కైల్ జేమీసన్, నవ్‌దీప్ సైనీ, మహ్మద్ సిరాజ్.
MI vs RCB: కీరన్ పొలార్డ్.. ఆ రెండు ఘనతలను ఈ మ్యాచ్‌లోనే సాధిస్తాడా?


Click it and Unblock the Notifications












