For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs RCB: కీరన్ పొలార్డ్‌.. ఆ రెండు ఘనతలను ఈ మ్యాచ్‌లోనే సాధిస్తాడా?

IPL 2021: Kieron Pollard two sixes away from entering Virat Kohli and Rohit Sharmas elite list

చెన్నై: ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021కు మ‌రికొద్ది గంట‌ల్లోనే తెర లేవ‌బోతోంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌తో తొలి టైటిల్ కోసం ఆరాట‌ప‌డుతున్న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డ‌బోతోంది. చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో రాత్రి 7.30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్ల సారథులు టీమిండియాకు టాప్ బ్యాట్స్‌మన్‌ కావడంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, ఏబీ డివిలియర్స్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, హార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌ల బ్యాటింగ్‌పై అందరి చూపు ఉంది. ఈమ్యాచ్ ద్వారా విండీస్ కెప్టెన్ పొలార్డ్‌ ఓ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు.

కీరోన్‌ పొలార్డ్‌ ఇంకా రెండు సిక్స్‌లు కొడితే.. రోహిత్‌, కోహ్లీ, డివిలియర్స్‌, గేల్‌, ధోనీల సరసన చేరిపోతాడు పొలార్డ్‌. ఓవరాల్‌గా 200 ఐపీఎల్‌ సిక్సర్ల క్లబ్‌లో చేరడానికి పొలార్డ్‌ ఇంకా రెండు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకూ 198 ఐపీఎల్‌ సిక్స్‌లు బాదిన పొలార్డ్‌.. ఆర్సీబీతో జరుగనున్న తొలి మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ను సాధించే అవకాశం ఉంది. హార్డ్‌ హిట్టర్‌ అయిన పొలార్డ్‌.. ఎప్పుడు మైదానంలోకి దిగినా అలవోకగా సిక్సులు బాదుతాడు. ఈరోజు కూడా తన బ్యాట్‌కు పని చెబితే సిక్సర్ల కింగ్స్‌ సరసన చేరిపోతాడు. ఈ జాబితాలో గేల్‌ (349), డివిలియర్స్ ‌(235), ధోనీ (216), రోహిత్‌ (213), కోహ్లీ (201)లు వరుసగా ఉన్నారు.

గత ఐపీఎల్ సీజన్‌లో కీరోన్‌ పొలార్డ్ 16 మ్యాచ్‌ల్లో 22 సిక్స్‌లు బాదాడు. బ్యాటింగ్‌లో 53.60 యావరేజ్‌తో 268 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ 2020లో పొలార్డ్‌ అత్యధిక స్కోరు 60 నాటౌట్‌. పొలార్డ్‌ నాలుగు ఫోర్లు కొడితే ఐపీఎల్ టోర్నీలో‌ 200 ఫోర్ల మార్కును చేరతాడు. ప్రస్తుతం పొలార్డ్‌ ఖాతాలో 196 ఐపీఎల్‌ ఫోర్లు ఉన్నాయి. ఈ రెండు రికార్డులు కూడా పొలార్డ్‌ ఆర్సీబీతో మ్యాచ్‌లోనే సాధిస్తాడో లేదో చూడాలి. ఇక ఏడు వికెట్లు సాధిస్తే.. టీ20 ఫార్మాట్‌లో 300 వికెట్ల మార్కును పొలార్డ్‌ అందుకుంటాడు.

అదే సమయంలో​ టీ20 ఫార్మాట్‌లో మూడొందల వికెట్లను, 5వేలకు పైగా పరుగులు చేసిన నాల్గో ఆల్‌రౌండర్‌గా కీరోన్‌ పొలార్డ్ నిలుస్తాడు. ఈ జాబితాలో డ్రేన్‌ బ్రేవో; షకీబుల్‌ హసన్‌, ఆండ్రీ రసెల్‌లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ ఐపీఎల్‌లో 10 క్యాచ్‌లో పడితే క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 100 క్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు పొలార్డ్‌. ఇక టీ20 ఫార్మాట్‌లో 700 ఫోర్లు పూర్తి చేసుకోవడానికి పోలార్డ్ 25 ఫోర్ల దూరంలో ఉన్నాడు. ఈ ఘనతలు అన్ని ఐపీఎల్ 2021లో సాధించే అవకాశాలు ఉన్నాయి.

Story first published: Friday, April 9, 2021, 17:47 [IST]
Other articles published on Apr 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+