న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైతో మ్యాచ్‌కు ఆ ఇద్దరిని తీసుకోండి.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆకాశ్ చోప్రా కీలక సూచన!

 IPL 2021: Aakash Chopras suggested team changes for the Sunrisers Hyderabad vs MI
IPL 2021 : Aakash Chopra Suggested Team Changes For The SRH Against MI || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టాలంటే పలు మార్పులు చేయాల్సిందేనని టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. ఈ క్యాష్ రిష్ లీగ్‌లో ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉన్న హైదరాబాద్.. మరొకొద్ది సేపట్లో ముంబై ఇండియన్స్‌ ప్రారంభమయ్యే మూడో సమరానికి సిద్దమైంది. అయితే ఈ పోరుకు గత రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన వికెట్ కీపర్ వృద్దీమాన్ సాహా స్థానంలో అభిషేక్ శర్మ, ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ ప్లేస్‌లో ముజీబ్ ఉర్ రెహ్మాన్‌కు అవకాశమివ్వాలని చోప్రా అభిప్రాయపడ్డాడు. అవసరమైతే విజయ్ శంకర్ స్థానంలో సీనియర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ ఆడించాలన్నాడు. ఈ చేంజింగ్ కాంబినేషన్‌తో ఫలితం రాబట్టవచ్చని అంచనా వేసాడు.

ముజీబ్ ముఖ్యం..

ముజీబ్ ముఖ్యం..

'మరోసారి సన్‌రైజర్స్‌కు నేనిచ్చే సలహా ఏంటంటే.. ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను జట్టులోకి తీసుకోవడం. ఎందుకంటే ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ చాలా భీకరమైనది. కాబట్టి రషీద్‌కు జతగా ముజీబ్ తోడైతే ఆ జట్టు విధ్వంసకర వీరులను అడ్డుకోవచ్చు. తొలి 10 ఓవర్లలో ముజీబ్ తన కోటా పూర్తి చేస్తే.. తదుపరి 10 ఓవర్లలో రషీద్ బౌలింగ్ చేయవచ్చు. ఈ ఇద్దరితో పాటు భువనేశ్వర్, నటరాజన్ ఎలాగూ పేస్ బాధ్యతలు పంచుకుంటారు. ఇక నాలుగో, ఐదో బౌలర్‌గా అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, విజయ్ శంకర్‌లను వాడుకోవచ్చు.

శంకర్‌ను పక్కనపెట్టాలి..

శంకర్‌ను పక్కనపెట్టాలి..

అవసరమైతే విజయ్ శంకర్ స్థానంలో కేదార్ జాదవ్‌ను జట్టులోకి తీసుకున్నా.. అతను రెండు ఓవర్లు బౌలింగ్ చేయగలడు. సాహా ప్లేస్‌లో అభిషేక్ శర్మ జట్టులోకి వస్తే.. హోల్డర్ స్థానంలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ తీసుకోవాలి. సమద్, అభిషేక్ శర్మలను పార్ట్‌ టైమ్ బౌలర్లుగా వాడుకోవాలి. ఇక మనీష్ పాండే తన బ్యాటింగ్‌లో కొంత దూకుడు కనబర్చాలి. అప్పుడే సన్‌రైజర్స్ విజయం సాధించగలదు'అని చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు.

విదేశీ ఆటగాళ్లు ముగ్గురు చాలు..

విదేశీ ఆటగాళ్లు ముగ్గురు చాలు..

ఇక పిచ్‌పై టర్నింగ్ లభిస్తున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగాలని చోప్రా సూచించాడు. దాని కోసం ఆ జట్టు తమ ఓవర్‌సీస్ ఆటగాళ్ల సంఖ్యను తగ్గించుకొని ముగ్గురితోనే బరిలోకిదిగాలన్నాడు. 'ముంబై జట్టులో భారీ మార్పులు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ జట్టు నేటి మ్యాచ్‌లో మార్కో జాన్సెన్‌ను పక్కనపెట్టాలి. విదేశీ ఆటగాళ్ల సంఖ్య నలుగురికి మించరాదనే నిబంధన ఉంది. కానీ తక్కువగా ఉండవద్దని లేదు. కాబట్టి జాన్సెన్ ప్లేస్‌లో రోహిత్ సేన పియూష్ చావ్లా లేదా జయంత్ యాదవ్‌ను తీసుకోవాలి.

అప్పుడు ఈ టర్నింగ్ ట్రాక్‌లపై ముంబైకి ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు అందుబాటులో ఉంటారు. ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగంలో బుమ్రా, బౌల్ట్‌లు ఉన్న నేపథ్యంలో మూడో ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆప్షన్‌గా హార్దిక్‌ కానీ పొలార్డ్‌ను కానీ ఉపయోంచుకోవాలి. ఈ ఇద్దరి చేత నాలుగు ఓవర్లు వేయించినా అప్పుడు లెక్క సరిపోతుంది.'అని చోప్రా చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, April 17, 2021, 17:08 [IST]
Other articles published on Apr 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X