న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: పంజాబ్‌ కింగ్స్ తుది జట్టు ఇదే.. 8 కోట్లు పెట్టికొన్న ఆ ఆటగాడికి మాత్రం స్థానం లేదు!!

IPL 2021: Aakash Chopras ideal playing XI for Punjab Kings, No place for Riley Meredith

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ మరో నాలుగు రోజులో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2021 ఏప్రిల్ ‌9న ప్రారంభమయి మే 30తో ముగుస్తుంది. ఏప్రిల్ ‌9న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే జట్లు ప్రాక్టీసులో నిమగ్నమయి ఐపీఎల్ 2021 కోసం సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జట్ల బలాలు, ఏ ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకుంటే బాగుంటుందన్న అంశంపై మాజీ క్రికెటర్లు పలు సూచనలు చేస్తున్నారు. టీమిండియా మాజీ ఓపెనర్, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా పంజాబ్‌ కింగ్స్ జట్టు విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

ఓపెనర్లుగా వారే దిగాలి:

ఓపెనర్లుగా వారే దిగాలి:

ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో మాట్లాడుతూ... 'కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌ ఓపెనర్లుగా మైదానంలోకి దిగాలి. మూడో స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌, నాలుగో స్థానంలో నికోలస్ పూరన్‌, ఐదో స్థానంలో దీపక్ హుడా, ఆరులో మోజెస్‌ హెన్రిక్స్‌ రావాలి. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ హెన్రిక్స్‌ ఉంటే.. జట్టు సమతూకంగా ఉంటుంది. ఇక ఏడో స్థానం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. షారుఖ్ ఖాన్‌, మణిదీప్ సింగ్‌, సర్ఫరాజ్ ఖాన్‌.. వీరిలో ఎవరినైనా తీసుకోవచ్చు' అని అన్నాడు.

 మెరెడిత్‌కు దక్కని స్థానం:

మెరెడిత్‌కు దక్కని స్థానం:

'ఇక బౌలింగ్‌ విషయానికొస్తే.. మురుగన్ అశ్విన్‌, రవి బిష్ణోయి, మొహ్మద్ షమీ, జై రిచర్డ్‌సన్‌ ఉండనే ఉన్నారు. జట్టు కూర్పు ఇలా ఉన్నట్లయితే.. ఈ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్ మెరుగ్గా రాణించడం ఖాయం. ఇది నా భావన మాత్రమే. వీరితో పాటు మరో ఆప్షన్‌ అర్ష్‌దీప్‌ కూడా ఉన్నాడు. మరో స్పిన్నర్‌ కావాలంటే తనను తీసుకోవచ్చు' అని పంజాబ్‌ కింగ్స్ జట్టుకు ఆకాశ్‌ చోప్రా సూచించాడు. పంజాబ్ కింగ్స్ ఏప్రిల్ 12న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో టోర్నీ ఆరంబించనుంది.

8 కోట్లు పెట్టి కొన్నారు:

8 కోట్లు పెట్టి కొన్నారు:

అయితే ఆకాశ్‌ చోప్రా జట్టులో పంజాబ్‌ కింగ్స్ తరఫున ఈ ఏడాది ఆడనున్న ఆస్ట్రేలియా టీ20 ఫాస్ట్‌ బౌలర్‌ రిలే మెరెడిత్‌కు మాత్రం స్థానం చోటు దక్కలేదు. ఇదే అందరిని ఆశ్చర్యపరుస్తోంది. గత ఫిబ్రవరి 18న జరిగిన మినీ వేలంలో మెరెడిత్‌ను పంజాబ్‌ ప్రాంఛైజీ రూ. 8 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. వేలంలో విదేశీ ఆటగాళ్ల విభాగంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా మెరెడిత్ నిలిచాడు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో తనదైన శైలిలో ఆకాశ్‌ చోప్రాకు రిప్లైలు ఇస్తున్నారు. 'మెరెడిత్‌కు ప్రాధాన్యం లేదా. అంత ధర పెట్టి కొనడం వృథానేనా' అని ఒకరు కామెంట్ చేయగా.. '8 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?' అని ఇంకొకరు అన్నారు. ఫాబియన్‌ అలెన్‌ను కూడా చోప్రా మర్చిపోయాడు.

 ప్లే ఆఫ్‌‌‌‌కు వెళ్లే చాన్స్:

ప్లే ఆఫ్‌‌‌‌కు వెళ్లే చాన్స్:

ప్రస్తుతం పంజాబ్ జట్టును చూస్తే తిరుగులేదనిపిస్తుంది. బ్యాటింగ్‌‌‌‌లో కేఎల్ రాహుల్‌‌‌‌, క్రిస్‌‌‌‌ గేల్‌‌‌‌, డేవిడ్‌‌ మలాన్.. ధనాధన్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు సరిపోయే ఆటగాళ్లు. ఇక నికోలస్‌‌‌‌ పూరన్‌‌‌‌, మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌తో టాపార్డర్‌‌‌‌ మరింత బలంగా కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్, మన్‌దీప్‌ల రూపంలో ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఇక బౌలింగ్‌‌‌‌లో షమీ,‌ రిచర్డ్సన్‌, మెరిడిత్‌ కీలకం కానున్నారు. ఇషాన్ పొరెల్, జలజ్‌ సక్సేనా, సౌరభ్‌ కుమార్, ఉత్కర్ష్‌ సింగ్‌‌లపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. టాప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ విన్నర్లు ఉన్నారు కాబట్టి పంజాబ్ ప్లే ఆఫ్‌‌‌‌కు వెళ్లే చాన్స్‌‌‌‌ ఉంది.

Chandra Naidu: భారత తొలి మహిళా క్రికెట్‌ వ్యాఖ్యాత కన్నుమూత!!

Story first published: Monday, April 5, 2021, 22:10 [IST]
Other articles published on Apr 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X