
ఒక మ్యాచ్ మాత్రమే ఆడి
ఎంఎస్ ధోనీ కారణంగానే సురేష్ రైనా, ఫాఫ్ డుప్లెసిస్, డ్వేన్ బ్రావో మరియు రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు చాలా సంవత్సరాలుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగుతున్నారు. అయితే చెన్నై జట్టులో ఒక మ్యాచ్ మాత్రమే ఆడి కాంట్రాక్టు కోల్పోయిన కొంతమంది క్రికెటర్లు కూడా ఉన్నారు.
ఈ జాబితాలో ఐదుగురు ప్లేయర్స్ ఉండగా.. అందులో ఇద్దరు భారత ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాన్ హేస్టింగ్స్, టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, భారత దేశవాళీ క్రికెటర్ మోను కుమార్, శ్రీలంక ఆల్‌రౌండర్ తిసార పెరీరాలు చెన్నై జట్టులో ఒక మ్యాచ్ మాత్రమే ఆడి ఆ తర్వాత కాంట్రాక్టు కోల్పోయారు.

విజయ్ శంకర్
విజయ్ శంకర్ 2014లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది.
విజయ్ ఒక్కటే ఓవర్ బౌలింగ్ చేసి 19 పరుగులు సమర్పించుకుని నిరాశపర్చాడు. బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. దాంతో తర్వాత మ్యాచ్‌ల్లో అతడిని తీసుకోలేదు. 2015 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై అతడిని వదులుకుంది. విజయ్ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్నాడు. 47 టీ20ల్లో 712 రన్స్ చేశాడు.

మోను కుమార్
భారత దేశవాళీ క్రికెటర్ మోను కుమార్ 2018లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు. 44 మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. చివరకు 2020లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మోను అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన మోను..20 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత మ్యాచ్‌ల్లో అతడికి ఆడే అవకాశం రాలేదు.
2021 సీజన్‌కు ముందు చెన్నై మోనుకు గుడ్ బై చెప్పింది. అయితే చెన్నై జట్టులో ఉన్నంతకాలం మోను ఆటగాళ్లను మాత్రం అలరించాడు. తన బట్టతలతో అందరిని నవ్వించాడు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మిస్టర్ 360 సురేష్ రైనాలపై కూడా మోను జోకులు పేల్చాడు. ఐపీఎల్ మొత్తంలో మోను ఆడింది ఒకేఒక్క మ్యాచ్.
CPL 2021 Final: నేడే సెంట్ కిట్స్, సెయింట్ లూసియా ఫైనల్.. ప్లేయింగ్ ఎలెవన్, డ్రీమ్ 11 జట్లు ఇవే!!

మార్క్ వుడ్
2018లో జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్‌ను రూ.1.5 కోట్లకు దక్కించుకుంది. అదే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో వుడ్‌కి తుది జట్టులో చోటు దక్కినా.. తనదైన మార్క్ చూపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి.. ఒక్క వికెట్‌కు కూడా పడగొట్టలేదు.
పైగా 49 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో తర్వాత మ్యాచ్‌ల్లో తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే కౌంటీ మ్యాచ్‌లు ఆడేందుకు సీజన్ మధ్యలోనే ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. 2019 వేలానికి ముందు చేనై.. వుడ్‌ని జట్టు నుంచి విడుదల చేసింది. అప్పటి నుంచి అతడ్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. మార్క్ వుడ్ ఆడింది కూడా ఒకే ఒక్క ఐపీఎల్ మ్యాచ్.

జాన్ హేస్టింగ్స్
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాన్ హేస్టింగ్స్‌ను 2011లో కొచ్చి టస్కర్స్ దక్కించుకుంది. కానీ ఈ ఆటగాడికి ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడటానికి మూడేళ్లు పట్టింది. హేస్టింగ్స్‌ని 2014లో చేనై కొనుగోలు చేసి.. ఇదే సీజన్‌లో రాంచీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన హేస్టింగ్స్.. 29 పరుగులు ఇచ్చి డేవిడ్ వార్నర్ వికెట్‌ని పడగొట్టాడు. అయినా చెన్నై అతడికి తర్వాత మ్యాచ్‌ల్లో అవకాశం ఇవ్వలేదు. ఆపై కొన్ని రోజులకే చెన్నై జట్టుతో కాంట్రాక్టును కోల్పోయాడు. హేస్టింగ్స్ ఐపీఎల్ టోర్నీలో మొత్తంగా మూడు మ్యాచులు ఆడాడు.

తిసార పెరీరా
2010లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ తిసార పెరీరా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో పెరీరాకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే ఒక్క ఓవర్ బౌలింగ్ చేసి 19 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత పెరీరా చెన్నై తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2011 ఐపీఎల్ వేలానికి ముందు పెరీరాను చెన్నై విడుదల చేసింది. ఆ తర్వాత పెరీరా ఐపీఎల్‌లో చాలా ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. 37 మ్యాచులలో 422 రన్స్ చేశాడు.


Click it and Unblock the Notifications












